సాధారణంగా ముఖ్యమంత్రి, ఒక మంత్రికి, ఎంపీకి, ఎమ్మెల్యేకు ఇలా గన్‌మెన్‌లు ఉండడం సాధారణమే. కానీ ఓ సాధారణ వ్యక్తికి కూడా గన్‌మెన్‌లు ఉన్నారు. ఈ విషయం విన్నవారందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణ వ్యక్తికి గన్‌మెన్‌లు ఉండడం ఏంటని ఆరా తీస్తున్నారు. ఇప్పుడు అసలు వివరాల్లోకి వెల్లి తెలుసుకుందాం.
Advertisement
అతను చేసేది తోపుడు బండిపై బట్టలు అమ్ముకోవడం. అతని వెనుక ఇద్దరు గన్‌మెన్‌లు ఏపీ 47 రైఫిల్ తో భద్రత కల్పిస్తున్నారు. ఇక ఆ వ్యక్తిని చూసిన ప్రతీ ఒక్కరూ ఇదేమిటనీ ఆశ్చర్యపోతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్ దయాళ్ అనే వ్యక్తి తోపుడు బండిపై వస్త్రాలు విక్రయిస్తుంటాడు. ఇటీవల సమాజ్ వాది పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్ సింగ్ సోదరుడు జుగేంద్రసింగ్ ను కలిసి తన భూమికి పట్టా ఇప్పించాలని రామేశ్వర్ దయాల్ కోరాడు. ఈ తరుణంలో రామేశ్వర్ దయాల్ కి, జుగేంద్ర సింగ్ కి వివాదం చోటు చేసుకుంది. ఈ తరుణంలో జుగేంద్రసింగ్ కులం పేరుతో దూషించాడంటూ రామేశ్వర్ దయాళ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Advertisement
ఈ విషయంపై కేసు నమోదు చేశారు. కోర్టులో కేసు విచారణకు రావడంతో జుగేంద్ర సింగ్ విచారణకు హాజరయ్యాడు. రామేశ్వర్ దయాల్ సైతం కోర్టుకు హాజరు కావాలని నోటీసులు రావడంతో హాజరయ్యాడు. రామేశ్వర్ దయాల్ ఒక్కడే కోర్టు ముందుకొచ్చాడు. ఇది వరకే అతని వల్ల అతనికి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశాడు. దీంతో రామేశ్వర్ దయాళ్ కి ఎందుకు భద్రత కల్పించలేదని కోర్టు పోలీసులను ప్రశ్నించింది. రామేశ్వర్ దయాళ్ కి వెంటనే బాడీగార్డులను నియమించాలని కోర్టు ఆదేశించింది. వెంటనే ఇద్దరు గన్‌మెన్ లను పోలీసులు నియమించారు. తోపుడు బండిపై బట్టలు అమ్ముతుండగా.. ఇద్దరు గన్‌మెన్ ఆయన పక్కనే ఉండి భద్రత కల్పిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read :
“ఒకేఒక్కడు” సినిమా పై అప్పట్లో ‘చంద్రబాబు’ ఏమని కామెంట్ చేసారో తెలుసా ? అస్సలు ఊహించి ఉండరుగా..!
కష్టాల్లో ఉన్న మోహన్ బాబు కు రజినీకాంత్ చేసిన సాయం అదేనా..? నిజంగా రజినికి హ్యాట్ సాఫ్…!