Home » “ఒకేఒక్కడు” సినిమా పై అప్పట్లో ‘చంద్రబాబు’ ఏమని కామెంట్ చేసారో తెలుసా ? అస్సలు ఊహించి ఉండరుగా..!

“ఒకేఒక్కడు” సినిమా పై అప్పట్లో ‘చంద్రబాబు’ ఏమని కామెంట్ చేసారో తెలుసా ? అస్సలు ఊహించి ఉండరుగా..!

by AJAY
Ad

దేశంలోని టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో శంకర్ కూడా ఒకరు తమిళ దర్శకుడు శంకర్ ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు, రోబో, అపరిచితుడు సినిమాలు రికార్డులు క్రియేట్ చేశాయి. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ పొలిటికల్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ తో కూడా శంకర్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు.

Advertisement

ఈ సినిమాను అపరిచితుడు చిత్రానికి రీమేక్ గా తెరకెక్కించబోతున్నారు. ఇదిలా ఉంటే శంకర్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఒకే ఒక్కడు సినిమా కూడా ఒకటి. ఒక్కరోజు ముఖ్యమంత్రి అనే సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించారు. ఇక ఈ సినిమాలోని ఓ సీన్ ను 400 మంది ఆర్టిస్టులతో దాదాపు 40 రోజుల వరకు చిత్రీంచారు.

Advertisement

 

సినిమాలోని మగధీర పాటను మైసూర్ ప్యాలెస్ లో చిత్రించారు. ఈ పాట కోసమే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతేకాకుండా ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం లండన్ నుండి నిపుణులను రప్పించారు. ఇక అప్పట్లో సౌత్ లో 20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం.

ఒక్కరోజు సీఎం అనే కాన్సెప్ట్ తో వచ్చినప్పటికీ సినిమాలో ఎక్కడా లాజిక్ మిస్ అవ్వకుండా శంకర్ పూర్తిగా రాజ్యాంగం గురించి తెలుసుకుని మరీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా వచ్చిన తర్వాత సినిమాలోని రఘువరన్ క్యారెక్టర్ తమిళనాడు సీఎంను పోలి ఉందంటూ అక్కడ భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం సినిమా నచ్చడం తో దర్శకుడు శంకర్ ను పిలిపించుకుని మరీ అభినందించారు.

Visitors Are Also Reading