తెలంగాణ ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ చాలా కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీలో వినూత్న పథకాలు, స్కీమ్‌లు, ఆఫర్లను ప్రకటిస్తూ జనాల్లో ఆర్టీసీపై ఉన్న ఆదరణను మరింత పెంచుతున్నారు. ఎప్పటికప్పుడూ కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ప్రగతి రథ చక్రాలను పరుగులు తీయిస్తున్నారు. ఏ పండుగ వచ్చినా..? ఏ ప్రత్యేకత ఉన్నా ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లు తీసుకువస్తున్నారు.
Advertisement
నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని గట్టేక్కించేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఈ తరుణంలో తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్బంగా మరొక ఆఫర్ ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా మరో ఆఫర్ ప్రకటించారు. 65 ఏళ్లు పైబడిన వారు, సీనియర్ సిటీజన్స్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చెయవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. కేవలం ఏప్రిల్ 02వ తేదీ మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బస్సులో ప్రయాణించేటప్పుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును కండక్టర్‌కు చూపించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చని సూచించారు.
Advertisement
మరొక వైపు హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల కోసం నూతన ఆఫర్ తీసుకొచ్చింది. సూపర్ సేవర్ కార్డును ఎల్ అండ్ టీ ఎండీ కే.వీ.బీ.రెడ్డి ప్రారంభించారు. ఈ కార్డుతో సెలవుల్లో తో రోజు అంతా మెట్రోలో తిరగవచ్చని ఆయన చెప్పారు. మెట్రో వర్గాలు ప్రకటించిన 100 రోజుల సెలవుల్లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజు అంతా తిరగవచ్చని స్పష్టం చేశారు. ఉగాది నుంచి మెట్రోలో సూపర్ సేవర్ కార్డులు విక్రయించనున్నట్టు ఎండీ ప్రకటించారు.