Home » BCCI సంచలన నిర్ణయం..IPL విదేశీ ప్లేయర్లకు ఎదురుదెబ్బ !

BCCI సంచలన నిర్ణయం..IPL విదేశీ ప్లేయర్లకు ఎదురుదెబ్బ !

by Bunty
Ad

2023 ఐపీఎల్ సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 23న కోచి వేదికగా ఈ మినీ యాక్షన్ జరుగుతుందని ప్రకటించింది. బీసీసీఐ ఈ టోర్నీకి ఈసారి 991 మంది రిజిస్టర్ అయ్యారని, వీరులో 714 మంది భారతీయులు కాగా 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారని బోర్డు పేర్కొంది. వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి కొత్త రూల్ ప్రవేశపెడుతున్నట్లు ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఈ ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన కేవలం భారతీయ ఆటగాళ్లకు మాత్రమే వర్తిస్తుందని తేల్చి చెప్పింది.

ఇవి కూడా చదవండి : కన్నడ ఇండస్ట్రీ బ్యాన్.. లోపల జరిగేది వేరంటూ నోరు విప్పిన రష్మికా మందన్న

Advertisement

Advertisement

అంటే జట్టులో ఉన్న ఒక భారతీయ ఆటగాడి స్థానంలో విదేశీ ప్లేయర్ ను ఆడించడానికి కుదరదు. అలాగే మరో విదేశీ ఆటగాడి స్థానంలో కూడా మరో విదేశీ ప్లేయర్ నువ్వు సబ్ స్టిట్యూట్ చేయడానికి వీల్లేదు. ఒక జట్టులో అత్యధికంగా నలుగురు మాత్రమే విదేశీ ఆటగాళ్లు ఉండాలనే నిబంధనను ఎవరు ఉల్లంఘించకూడదు అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, కావాలంటే విదేశీ ఆటగాళ్ల స్థానంలో సబ్ స్టిట్యూట్ గా భారతీయ ఆటగాడిని తీసుకోవచ్చు. కానీ మరో విదేశీ ప్లేయర్ ను తీసుకోవడానికి వీల్లేదు. తద్వారా ఆదనంగా ఐదో విదేశీ ప్లేయర్ ను ఆడించే అవకాశం ఫ్రాంచైజీ లకు ఉండదు. ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన వల్ల ఫ్రాంచైజీలు బాగా లాభపడే అవకాశం ఉంది. చేజింగ్ సమయం లో స్పెషలిస్ట్ బ్యాటర్ ను, లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే స్పెషలిస్ట్ బౌలర్ ను సబ్ స్టిట్యూట్ చేసుకునే వీలుంటుంది.

అసలు ఏంటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ : సింపుల్ గా చెప్పాలంటే సబ్ స్టిట్యూట్ ప్లేయర్ నే ఇంపాక్ట్ ప్లేయర్ గా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఫుడ్ బాల్, రగ్బీ ఆటలను చూసేవారికి ఇంపాక్ట్ ప్లేయర్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. ప్రస్తుతానికి టాస్ వేశాక ప్రకటించిన తుది జట్టు ప్లేయర్లకు మాత్రమే బ్యాటింగ్, బౌలింగ్ చేసే వీలు ఉంది. మధ్యలో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో సబ్ స్టిట్యూట్ గా వచ్చే ప్లేయర్ కేవలం ఫీల్డింగ్ వరకే పరిమితం అవుతాడు.

Read Also : గుడ్‌ న్యూస్‌ చెప్పిన హాట్‌ బ్యూటీ.. క్యాన్సర్‌ను జయించి మరీ షూటింగ్‌కు !

Visitors Are Also Reading