Home » Pakistan : ఇమ్రాన్‌ఖాన్‌కు ప‌ద‌వీ గండం

Pakistan : ఇమ్రాన్‌ఖాన్‌కు ప‌ద‌వీ గండం

by Anji
Ad

పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ పీక‌ల్లోతు క‌ష్టాల‌లో కూరుకుపోయారు. ప్ర‌భుత్వం తీవ్ర సంక్షోభంలో మునిగిపోవ‌డంతో ఆయ‌న‌కు ప‌ద‌వీ గండం త‌ప్పేలా లేదు. ఇప్ప‌టికే ఇమ్రాన్ ఖాన్‌కు వ్య‌తిరేకంగా సొంత పార్టీల‌కు చెందిన పలువురు ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేస్తున్నారు. 25 మంది ఎంపీలు, ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు.

Advertisement

ఇదేబాట‌లో మ‌రికొంద‌రూ ఉన్నారు. ఈనెలాఖ‌రులోఇమ్రాన్‌ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జ‌రుగ‌నున్న‌ది. ప్ర‌తిప‌క్షాలు తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం కార‌ణంగా ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం తీవ్ర ఇబ్బందుల్లో ప‌డింది. ఇప్ప‌టికే అక్క‌డి ప్ర‌జ‌లు ఆయ‌న పాల‌న ప‌ట్ల నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ దేశంలో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌లేక‌పోతున్నార‌ని దేశంలో నిత్య‌వ‌స‌రాలు ధ‌ర‌లు, నిరుద్యోగం పెరిగిపోతున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

అవిశ్వాస తీర్మాణంలో ఇమ్రాన్ నెగ్గ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం 342 మంది స‌భ్యుల‌న్న పాకిస్తాన్ పార్ల‌మెంట్‌లో 172 మంది ఇమ్రాన్ ఖాన్‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తే ఆయ‌న త‌న ప్ర‌ధాని ప‌ద‌వీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక సైన్యం కూడా ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ ప్ర‌భావం ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ క్రికెట్ సిరిస్ పైనా ప‌డే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే ఇమ్రాన్‌కు వ్య‌తిరేకంగా ఇస్లామాబాద్‌లో భారీ ర్యాలీలు జ‌రుగుతున్నాయి. ఇంకోవైపు ఈనెల 29 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వ‌న్డేలు, ఒక టీ-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు బ‌స చేసే హోట‌ల్‌కు స‌మీపంలోనే ఆ ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. దీంతో సిరీస్ జ‌రుగుతుఆందా..? లేదా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఆస్ల్రేలియాతో సిరీస్ వేదిక‌ను ఇస్లామాబాద్ నుంచి లాహోర్ కు మార్చే ఆలోచ‌న‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పీసీబీ ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Also Read :  హోలీ పండుగ రోజు కామ ద‌హ‌నం ఎందుకు చేస్తారో తెలుసా..?

Visitors Are Also Reading