Home » థమన్ మావా మళ్ళీ దొరికిపోయాడా ? వీరసింహారెడ్డి మూవీ నుండి ‘జై బాలయ్య పాట‌ అక్కడ నుంచి కాపీ ?

థమన్ మావా మళ్ళీ దొరికిపోయాడా ? వీరసింహారెడ్డి మూవీ నుండి ‘జై బాలయ్య పాట‌ అక్కడ నుంచి కాపీ ?

by AJAY
Ad

నట‌సింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తర్వాత వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పోస్టర్ లు ప్రేక్షకులను ఎంతగానో కట్టుకుంటున్నాయి. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.

Advertisement

మైత్రి మూవీమేక‌ర్స్ బ్యానర్ పై ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా మాస్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక అఖండ సినిమా మ్యూజిక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ సంగతి తెలిసిందే. దాంతో వీరసింహారెడ్డి సినిమాకు సైతం త‌మ‌న్ ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా తీసుకున్నారు. కాగా తాజాగా ఈ సినిమా నుండి జై బాలయ్య అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.

Advertisement

అఖండ సినిమాలోనూ జై బాలయ్య అనే టైటిల్ సాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలోను జై బాలయ్య సాంగ్ అనే మ‌రో పాట‌ను తీసుకున్నారు. ఈ పాటకు రామజోగ‌య్య‌ శాస్త్రి స్వరాలు సమకూర్చగా…సింగ‌ర్ కరీముల్లా ఈ పాటను పాడారు. ఇక ఈ సాంగ్ లో బాలయ్య పై ఊరి జ‌నాలు పొగడ్తలు కురిపిస్తారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో దూసుకుపోతోంది.

ఇదిలా ఉంటే ఈ సాంగ్ పై కొన్ని ట్రోల్స్ కూడా వస్తున్నాయి. ఈ పాటను సింహ రాశి సినిమాలో పేదలంటే ప్రాణమిచ్చే మన అన్న రాజు పాట నుండి త‌మ‌న్ మ్యూజిక్ లేపేశార‌ని… అదేవిధంగా భరత్ అనే నేను సినిమాలోని వచ్చాడయ్యో సామి పాట నుండి కాపీ కొట్టాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా తమన్ పై ఇలాంటి ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading