Home » అప్పుడు నీతులు..ఇప్పుడు ఐట‌మ్ సాంగ్స్..స‌మంత‌పై నెటిజ‌న్ల ఫైర్..!

అప్పుడు నీతులు..ఇప్పుడు ఐట‌మ్ సాంగ్స్..స‌మంత‌పై నెటిజ‌న్ల ఫైర్..!

by AJAY
Ad

టాలీవుడ్ న‌టి స‌మంత అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్నసుకుమార్ ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పుష్ప సినిమాలో ఐట‌మ్ సాంగ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ పాట లిరిక‌ల్ వీడియోను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సాధార‌ణంగానే సుకుమార్ సినిమాల‌లో ఐట‌మ్ సాంగ్ ల‌కు స్పెష‌ల్ క్రేజ్ ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కూ సుక్కు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అన్ని సినిమాల్లోనూ స్పెష‌ల్ సాంగ్స్ సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచాయి.

Advertisement

కాగా ఇప్పుడు పుష్ప సినిమా పాట‌కు కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వ‌స్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ స‌మంత ఐట‌మ్ పాట‌కు స్టెప్పులు వేయ‌డంతో మ‌రింత క్రేజ్ పెరిగింది. ఊ అంటావా…ఊ ఊ అంటావా అంటూ సాగే ఈ పాట‌లో స‌మంత రెచ్చిపోయిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతూ రీసెంట్ గా బాలీవుడ్ లో ఫ్యామిలీమ్యాన్ 2 లాంటి వెబ్ సిరీస్ తో స‌మంత ఆకట్టుకుంది. కానీ ఇలాంటి సమ‌యంలో స‌మంత ఐట‌మ్ సాంగ్ ఏంటి అని అంతా అవాక్క‌య్యారు. మ‌రోవైపు స‌మంత గ‌తంలో చేసిన ఓ పోస్ట్ ను ప‌ట్టుకుని ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

స‌మంత గ‌తంలో మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలోనే వ‌చ్చిన నంబ‌ర్ వ‌న్ సినిమాలోని ఆవ్ తుజో…మోగ్ కోర్తా పాట‌లో కృతి స‌న‌న్ మ‌హేశ్ బాబు వెంట ప‌డుతూ కుక్కలా పాక‌డం పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే ఇప్పుడు స‌మంత కూడా సుకుమార్ సినిమాలోనే ఓ ఐట‌మ్ సాంగ్ చేసింది. దాంతో అప్పుడు స‌మంత చేసిన ట్వీట్ పై ఇప్పుడు నెటిజ‌న్లు ట్రోల్స్ చేస్తున్నారు. క‌ర్మ అనేది భూమ‌రాంగ్ స‌మంత అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా స‌మంత ఏం చేసినా ఆమె చాయిస్ కానీ వేరే వాళ్ల‌కు అలా ఉండ‌దు అంటూ చుర‌కలు అంటిస్తున్నారు.

Visitors Are Also Reading