Home » స‌మంత ఐటెం సాంగ్ పై దారుణ‌మైన ట్రోలింగ్‌..అంతా కాపీ అంటూ !

స‌మంత ఐటెం సాంగ్ పై దారుణ‌మైన ట్రోలింగ్‌..అంతా కాపీ అంటూ !

by Bunty
Ad

పాన్ ఇండియా మూవీగా పుష్ప సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమా కు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇక సినిమా నుంచి వ‌చ్చిన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. నిన్న ఈ సినిమా నుంచి స‌మంత న‌టించిన ఐటెం సాంగ్ ను విడుద‌ల చేశారు. స‌మంత న‌టించడంతో ఈ సాంగ్ పై అంచ‌నాలు భారీగా పెరిగి పోయాయి. క‌చ్చితంగా ఈ ఐటెం సాంగ్ బ్లాక్ బాస్ట‌ర్ అవుతుంద‌ని అభిమానులు ఆశించారు.

Advertisement

Advertisement

కానీ.. తీరా చూస్తే.. ఇదొక కాపీ ట్యూన్ అని దేవీ శ్రీ ప్ర‌సాద్ గాలి తీసేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఐటెం సాంగ్ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. తాజాగా సాంగ్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను ఇంద్ర వ‌తి చౌహాన్ అనే ఫోక్ సింగ‌ర్ తో పాడించారు. దీనికి చంద్ర‌బోస్ లిరిక్స్ అందించారు. ఊ అంటావా.. మావా ఊఊ అంటావా అంటూ సాగే ఈ పాట‌ను వింటుంటే.. సూర్య న‌టించిన వీడోక్క‌డే సినిమాలో హానీ హానీ అనే సాంగ్ గుర్తొస్తుంది. ట్యూన్ ఒకేలా ఉండ‌టంతో దేవి శ్రీ ప్రసాద్ కాపీ చేశాడ‌మ‌నేది నెటిజ‌న్ల వాద‌న‌. ఆ పాట‌..ఈ పాట ఒకే లా ఉంద‌ని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే.. దీనిపై దేవి శ్రీ ప్ర‌సాద్ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

Visitors Are Also Reading