Telugu News » రష్మికకు మానవత్వమే లేదంటూ దారుణంగా ట్రోల్ చేసున్న నెటిజన్స్…వీడియో వైరల్…!

రష్మికకు మానవత్వమే లేదంటూ దారుణంగా ట్రోల్ చేసున్న నెటిజన్స్…వీడియో వైరల్…!

by AJAY MADDIBOINA

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయం సాధించడంతో రష్మిక గ్యాప్ లేకుండా అవకాశాలు దక్కించుకుంటుంది. రీసెంట్ గా రష్మిక హీరోయిన్ గా నటించిన పుష్ప సినిమా భారీ విజయం సాధించింది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్ లో విడుదల కావడంతో రష్మిక కు తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు వచ్చింది.

Ads

Rashmika

ఇక రష్మిక బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో ఎక్కువగా ముంబైలోనే కనిపిస్తోంది. కాగా తాజాగా మరోసారి రష్మిక ముంబైలో కెమెరాలకు చిక్కింది. ఓ రెస్టారెంట్ లో భోజనం చేసి రష్మిక బయటకు వచ్చింది. అయితే అదే సమయంలో అక్కడున్న కొంతమంది పిల్లలు రష్మిక వెంటపడ్డారు. ఆకలిగా ఉందని డబ్బులు కావాలని అడిగారు. కానీ రష్మిక వాల్ల ముఖం కూడా చూడకుండా పక్క నుంచి వెళ్ళిపోయింది.

rashmika2

rashmika

అంతేకాకుండా కారులో కూర్చుని కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. అక్కడికి వచ్చిన పిల్లలు మీరు పుష్ప సినిమాలో నటించారు కదా అంటూ ప్రశ్నించారు. అయినా రష్మిక వాళ్ల మాటలు పట్టించుకోలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో రష్మిక పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. పిల్లలు అడిగితే కనీసం భోజనం పెట్టించలేదు అని ఫైర్ అవుతున్నారు. రష్మిక కు మానవత్వం లేదని మండిపడుతున్నారు. ఇక మరికొంతమంది రష్మిక చేసింది కరెక్టే అని పిల్లలకు డబ్బులు ఇస్తే అలవాటు అయిపోతుంది సపోర్ట్ చేస్తున్నారు.

 


You may also like