Home » “ఆచార్య” లో యంగ్ చిరు దర్శనం….ఇదెక్కడి వీఎఫ్ఎక్స్ బాబోయ్ అంటూ నెట్టింట ట్రోల్స్…!

“ఆచార్య” లో యంగ్ చిరు దర్శనం….ఇదెక్కడి వీఎఫ్ఎక్స్ బాబోయ్ అంటూ నెట్టింట ట్రోల్స్…!

by AJAY
Ad

Acharya Trolls: కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ముఖ్యమైన పాత్రలో నటించాడు. రామ్ చరణ్ కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక సినిమాలో చిరంజీవి పాత్ర కు హీరోయిన్ సెట్ కాదని చిత్ర యూనిట్ కాజల్ ను తప్పించింది.

Advertisement

 

సినిమాలో విలన్ పాత్రలో సోనూసూద్ నటించారు. ఇక పాన్ ఇండియా ప్రాజెక్టుగా ఈ సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కానీ చివరగా తెలుగులో మాత్రమే ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఇక ఈ సినిమాకు బెనిఫిట్ షో నుండే నెగిటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమా కొరటాల శివ రేంజ్ లో లేదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా చిరంజీవి రామ్ చరణ్ చేయాల్సిన సినిమా కూడా కాదని అంటున్నారు.

Advertisement

మరోవైపు ఈ సినిమాలోని ఓ సీన్ పై కూడా కూడా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో యంగ్ చిరుని చూపించారు. అయితే విఎఫ్ఎక్స్ ఉపయోగించి చిరు ను క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన సీన్ వచ్చినప్పుడు కొంతమంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దాంతో చిరు లుక్ వైరల్ అవుతోంది అయితే ఈ విఎఫ్ఎక్స్ లో చిరు కార్టూన్ లాగా కనిపిస్తున్నారు. దాంతో నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. ఇదెక్కడి వీఎఫ్ఎక్స్ బాబోయ్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మీమర్స్ కు కూడా మంచి స్టఫ్ దొరకడం తో మీమ్స్ వేస్తున్నారు.

Also read :

సినిమా రిలీజ్ కు ముందు నుండే ఆచార్య పై నెగిటివ్ ప్రచారం….తెరవెనక నుండి దెబ్బ కొట్టింది ఆ వర్గమేనా…?

నేనే మీ వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటా…విజయ్ దేవరకొండ పై సమంత కామెంట్స్ వైరల్…!

Visitors Are Also Reading