Home » పుష్ప లో మరో కాపీ దొరికేసింది గా..! అల్లుఅర్జున్ మ్యానరిజమ్స్ కి ఇన్స్పిరేషన్ ఇదే ?

పుష్ప లో మరో కాపీ దొరికేసింది గా..! అల్లుఅర్జున్ మ్యానరిజమ్స్ కి ఇన్స్పిరేషన్ ఇదే ?

by AJAY

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా రష్మిక మందన సినిమాలో హీరోయిన్ గా నటించింది. థియేటర్ లో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో విడుదలైంది. ఈ చిత్రంతో అల్లు అర్జున్ మొదటి సారి పాన్ ఇండియాకు పరిచయమైన సంగతి తెలిసిందే.

అయితే మొదటి సినిమాతోనే అల్లు అర్జున్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఎక్కడ చూసినా పుష్ప మేనియానే కనిపిస్తోంది. ఈ సినిమాలో డైలాగులకు…ఊ అంటావా పాటను దేశ విదేశాల క్రికెటర్లు సైతం అనుకరిస్తున్నారు. దాంతో పుష్ప క్రేజ్ ఎల్లలు దాటిపోతోంది. ఇప్పటికీ బాలీవుడ్ లో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది.

ఓటీటీలో చిత్రాన్ని విడుదల చేసినప్పటికీ థియేటర్ లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమాలోని అల్లు అర్జున్ తగ్గేదే మేనరిజంను ఒక దగ్గర నుంచి కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అది ఎక్కడినుంచో కాదు. రౌడీ బేబీ సాయి పల్లవి వద్ద నుండి కాపీ కొట్టారు అంటూ ట్రోల్స్ వస్తున్నాయి.

Trolls on pushpa

Trolls on pushpa

సాయి పల్లవి ధనుష్ హీరో హీరోయిన్ లుగా మారి అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రౌడీ బేబీ అనే పాట యూట్యూబ్ ను షేక్ చేసింది. అయితే ఈ పాటలో సాయి పల్లవి రౌడీ బేబీ అనుకుంటూ తగ్గేదే లేదు అనే మ్యానరిజమ్ చూపిస్తుంది. దాంతో పుష్ప కోసం అక్కడి నుంచి సుకుమార్ కాపీ కొట్టారంటూ నెట్టింట మీమ్స్ వస్తున్నాయి.

Also read : Life Story : భ‌ర్త‌తో నా చెల్లి, నా కాపురాన్ని త‌న‌కే త్యాగం చేశా!

Visitors Are Also Reading