Home » ఏజెంట్ కు నెగిటివ్ టాక్…అయ్యగారు అంటూ అఖిల్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్..!

ఏజెంట్ కు నెగిటివ్ టాక్…అయ్యగారు అంటూ అఖిల్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్..!

by AJAY

అక్కినేని నట వారసుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హీరో అఖిల్. మొదటి సినిమాతోనే అఖిల్ ఫ్లాప్ అందుకున్నాడు. వివి వినాయక్ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ అఖిల్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏఎన్ఆర్ తాత… నాగార్జున తండ్రి కావడంతో అఖిల్ పై అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అఖిల్ తర్వాత యంగ్ హీరో పలు చిత్రాలతో ముందుకు వచ్చాడు.

మాస్, రొమాంటిక్ ఇలా అన్ని రకాల సినిమాల్లోనూ నటించాడు. అయినప్పటికీ ఏ సినిమా కూడా అక్కినేని అభిమానులను సంతోషపరచలేదు. అయితే అఖిల్ సినిమాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా కొంతవరకు ప్రేక్షకులను మెప్పించింది. కాగా తాజాగా అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య తెర‌కెక్కింది. ఈ సినిమా ఈనెల 28న విడుదలైంది. సినిమా టీజర్ ట్రైలర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అంతే కాకుండా సురేందర్ రెడ్డికి హిట్ ట్రాక్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా పక్కా హిట్ అవుతుందని అభిమానులు అనుకున్నారు. కానీ చివరికి ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. ప్ర‌స్తుతం ఏజెంట్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది.

ఇక వరుస ఫ్లాప్ లు రావడంతో అఖిల్ పై ట్రోల‌ర్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసినా అఖిల్ కు హిట్ పడటంలేదని కామెంట్ చేస్తున్నారు. అఖిల్ సినిమాలు మానేసి వ్యాపారాలు చూసుకుంటే బెటర్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. అయ్యగారికి ఈ సినిమాలు వచ్చి రావడం లేదంటూ కామెంట్ లు పెడుతున్నారు. అంతేకాకుండా అఖిల్ ఫైట్లు డ్యాన్స్ మీద పెట్టే దృష్టి సినిమా కథలపై పెట్టాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ :ఏజెంట్ ఓటీటీ వేదిక ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 

Visitors Are Also Reading