Home » ఏజెంట్ ఓటీటీ వేదిక ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 

ఏజెంట్ ఓటీటీ వేదిక ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? 

by Anji
Ad

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ఏజెంట్ ఏప్రిల్ 28న విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీ స్ప్రై థ్రిల్లర్ మూవీగా విడుదలకు ముందు ప్రచారం చేసినప్పటికీ.. ఆ తరహా స్టోరీ కంటే యాక్షన్ డ్రామానే ఎక్కువగా ఉందని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. ఇక అదే సమయంలో ఈ మూవీకి మిశ్రమ స్పందన లభిస్తుంది. ఎక్కువ శాతం నెగిటివ్ టాక్ వస్తోంది. పాజిటివ్ టాక్ పెద్దగా రావడం లేదు. మరోవైపు అఖిల్ కష్టమంతా వృథా అయిందని సోషల్ మీడియా మొత్తం ఒక్కటే డిస్కషన్ నడుస్తోంది. ఇక ఇదే సమయంలో ఏజెంట్ ఓటీటీకి సంబంధించిన ఓ వార్త బయటికొచ్చింది. అసలు ఇంతకు ‘ఏజెంట్’ మూవీ ఎందులో ? ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  Krishna Simhasanam: మూవీ కోసం 12 కి.మీ క్యూ లైన్ లు కట్టారని మీకు తెలుసా..?

Advertisement

agent-review

Advertisement

అసలు విషయానికొస్తే.. ప్రతీ వారం కొత్త సినిమాలు విడుదలవ్వడమే లేటు. థియేటర్లలోకి వెళ్లే వారు చాలా మంది ఉంటారు. కొందరూ మాత్రం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా అఖిల్ ‘ఏజెంట్’ గురించి కూడా పలువురు నెటిజన్లు అదేవిధంగా సెర్చ్ చేస్తున్నారు. వారికి డీటేయిల్స్ కూడా లభించాయి. ఈ మూవీ చూసిన వారు, అదేవిధంగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న దానిని బట్టి చూస్తూ ‘ఏజెంట్’ ఓటీటీ హక్కులను ‘సోనీలివ్’ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. 

Also Read :  “నన్ను క్షమించు” ఆ హీరోయిన్ కి ఫోన్ బాధపడిన ఎన్టీఆర్.. ఎందుకో తెలుసా ?

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో అఖిల్ తో పాటు మమ్ముట్టి కూడా లీడ్ రోల్ చేశారు. దర్శకుడు సురేందర్ రెడ్డి దాదాపు నాలుగేళ్ల తరువాత సినిమా తీశారు. కానీ హిట్ మాతరం సాధించలేకపోయారనే చెప్పాలి. సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో సైర నరసింహారెడ్డి సినిమా తరువాత చిత్రం ఏజెంట్ కావడం విశేషం. సైర నరసింహారెడ్డి కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆశించిన ఫలితం దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఏజెంట్ కూడా ఇదే కోవలోకి వెళ్లింది. 

Also Read :  చిరంజీవి ఇంద్ర స్టోరీని తొలుత ఆ ద‌ర్శ‌కుడు రిజెక్ట్ చేశాడ‌నే విష‌యం మీకు తెలుసా..?

Visitors Are Also Reading