trisha prakash raj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు పొందిన కథానాయక త్రిష. తరుణ్ హీరోగా నటించిన నీ మనసు నాకు తెలుసు మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇది ఆమె స్ట్రెయిట్ మూవీ కాదు. తెలుగులో ఈమె స్ట్రైట్ మూవీ వర్షం అని చెప్పవచ్చు. 2004లో విడుదలైన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయనందుకుంది. త్రిష తన కెరియర్ ను తమిళ సినిమాలతో ప్రారంభించిన ఆమెకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చిన మూవీ మాత్రం తెలుగులోనే వచ్చింది.
also read:Hit 2 Movie OTT Release: అడివి శేష్ హిట్ 2 ఓటీటీలోకి అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
వర్షం చిత్రం తర్వాత త్రిష కెరియర్ మారింది. తెలుగు తమిళ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి త్రిష తన కెరియర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. తన సినీ కెరియర్ లో ఆ ఒక్క నటుడు అంటే ఆమెకు చాలా ప్రత్యేకం ఇష్టమట. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే.. ఆ నటుడు త్రిషతో తండ్రిగా, మామగా, బాయ్ ఫ్రెండ్ గా కూడా చేశాడు. ఆయన ఎవరో కాదు ప్రకాష్ రాజ్.
ఆకాశమంత, వర్షం, పోన్నియన్ సెల్వన్ 1 వంటి చిత్రాల్లో ప్రకాష్ రాజ్ త్రిషకి తండ్రిగా నటించాడు. అలాగే “నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రంలో ఈమెకు మామగా నటించాడు. ఇక గిల్లి (ఒక్కడు తమిళ్ రీమేక్ ) త్రిష కి ప్రి*డు పాత్రలో చేశాడు ప్రకాష్ రాజ్.. ఈ విధంగా త్రిష మరియు ప్రకాష్ రాజుల కాంబినేషన్ చాలా వైవిధ్యంగా కొనసాగిందని చెప్పవచ్చు.
also read: