VEERA SIMHA REDDY Trending 10 Telugu Memes and Trolls: నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వీరసింహారెడ్డి’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే జనవరి 06న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒంగోలు నిర్వహించారు. ఈవెంట్ లో దర్శకుడు బి.గోపాల్ వీరసింహారెడ్డి ట్రైలర్ ని విడుదల చేశారు. హై ఓల్టేజ్ యాక్షన్ సీన్లతో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
Advertisement
వీరసింహారెడ్డిలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒకటి వీరసింహారెడ్డి కాగా.. రెండోది బాల నరసింహారెడ్డిగా రెండు విభిన్న పాత్రల్లో అలరించనున్నాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి బాలయ్య గోల్డ్ కలర్ బ్లేజర్ తో హాజరయ్యారు. ఈ చిత్రంలో లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగ్ లు పేలాయి. ప్రధానంగా ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సంతకాలు పెడితే బోర్డుపై మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.. మార్చలేరంటూ.. చెప్పిన డైలాగ్.. ఇటీవల ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడం పై సెటైర్లు వేసినట్టు తెలుస్తోంది.
బాలయ్య అభిమానులు ఏం కోరుకుంటున్నారో అదే ఈ సినిమాలో ఉండబోతుందని ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ఈ ట్రైలర్ ని బాలయ్య ఫ్యాక్షనిజం సినిమాల వైపు అడుగులు వేసేవిధంగా దర్శకుడు బి.గోపాల్ విడుదల చేసారు. దర్శకుడు బి.గోపాల్ తనకు ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నందమూరి నటసింహం బాలయ్య మాట్లాడుతూ.. తనకు చెంఘిజ్ ఖాన్ పై సినిమా చేయాలని ఉందని.. అది నా ఆశయం అని పేర్కొన్నారు. బాలయ్య చెప్పిన వెంటనే సోషల్ మీడియాలో ఛెంఘిజ్ ఖాణ్ ఎవరు..? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. చెంఘిజ్ ఖాన్ ఓ మంగోల్ సామ్రాజ్య స్థాపకుడు. ఆయన వేసిన పునాది మంగోల్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతి పెద్ద సామ్రాజ్యంగా పేరుగాంచింది. చెంఘిజ్ ఖాన్ ఈశాన్య ఆసియాకి చెందిన ఓ సంచారజాతికి చెందిన వాడు. ప్రపంచంలోనే గొప్ప వీరు చెంఘిజ్ ఖాన్. బాలయ్య కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి మరి.
Advertisement
ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నెటిజన్స్ తమకు తమకు నచ్చినట్టు మీమ్స్, ట్రోలింగ్స్ చేస్తున్నారు. బాలయ్య వీరసింహారెడ్డి సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నే సృష్టిస్తోంది.