జోగమ్మ హెరిటేజ్ కు చెందిన ట్రాన్స్ జెండర్ జానపద నృత్యకారిని మాతా బీ మంజమ్మ జోగతి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. మంజమ్మ కర్ణాటక జానపద అకాడమీ అధ్యక్షురాలిగా పని చేసిన మొట్టమొదటి ట్రాన్స్ ఉమెన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. మంజమ్మ జానపద కళకు చేసిన కృషికిగాను పద్మశ్రీ అవార్డు అందుకుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మంజమ్మ తన జానపద కళ తో వేల మందిని అలరించింది. అదేవిధంగా జానపద కళకు మరింత వన్నె తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆమెను పద్మశ్రీ వరించింది.
Advertisement
ఇక మంజమ్మ రాష్ట్రపతి భవన్ లో రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకునే సమయంలో ముందుగా స్టేజ్ ఎక్కేటప్పుడు నమస్కారం చేసుకుంది. ఆ తర్వాత రామ్ నాథ్ కోవింద్ వద్దకు వెళ్లి తన కొంగుతో ఆయనను ఆశీర్వదించింది. ఈ సన్నివేశం స్టేజ్ పై ఉన్న ప్రధాని మోడీ మరియు కేంద్ర మంత్రులను ఆశ్చర్యపరిచింది. మంజమ్మ హావభావాలకు ముగ్ధులైన వారంతా చిరునవ్వులు చిందించారు.
Advertisement
ఇక రామ్ నాథ్ కోవింద్ ను ఆశీర్వదించిన అనంతరం కోవింద్ అంజమ్మ తో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడారు. ఇక ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే మంచి జరగాలని ఆశీర్వదించడం ట్రాన్స్ జెండర్ ల సాంప్రదాయం… వాళ్లు తమ కొంగుతో ఆశీర్వదిస్తే మేలు జరుగుతుందని భావిస్తుంటారు. అంతేకాకుండా శుభకార్యాలకు సైతం వెళ్లి ట్రాన్స్ జెండర్ లు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మంజమ్మ తనకు అవార్డు ను అందజేసిన రామ్నాథ్ కోవింద్ ను చల్లగా ఉండాలని ఆశీర్వదించింది.