బుల్లితెరపై ప్రసారం అయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ప్రోగ్రామ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికీ తెలుగులో 5 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఆరవ సీజన్ కూడా ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలోనే బిగ్‌బాస్ కార్యక్రమాన్ని ఓటీటీలో ప్రసారం చేయనున్నట్టు వెల్లడించారు. బిగ్‌బాస్ ద్వారా ఎంతో మంది హాజరై కెరీర్ పరంగా.. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.
Advertisement
ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్‌గా ఎంతో పేరు ఉన్న సెలబ్రిటీలను ఆహ్వానించడమే కాకుండా మూడవ సీజన్ నుంచి ట్రాన్స్ జెండర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆనవాయితిగా వస్తుంది. గతంలో తమన్నా, సింహాద్రి బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొనగా.. తాజాగా పూర్తయిన ఐదవ సీజన్‌లో ట్రాన్స్ జెండర్‌గా ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటరయ్యారు.
Advertisement
ముఖ్యంగా బిగ్‌బాస్ హౌస్‌లో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న ప్రియాంక సింగ్ ఏకంగా 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగారు. ఇకపోతే తాజాగా వచ్చే సీజన్‌లో బిగ్‌బాస్ హౌస్‌లో వెళ్లనున్న ట్రాన్స్‌జెండర్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమంలోకి ట్రాన్స్ జెండర్ గా హిజ్రా ఫౌండర్, స్పోక్ పర్సన్ చంద్రముఖీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రి ఇస్తున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.
త్వరలోనే ఓటీటీలో ప్రసారం కానున్నీ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఈమెకు బిగ్‌బాస్ నిర్వాహకుల నుంచి ఫోన్ వెళ్లిందని అయితే ఈమె ఓటీటీలో ప్రసారమయ్యే కార్యక్రమంలో పాల్గొనడానికి సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. కానీ బిగ్‌బాస్ సీజన్ 6లో తనకు అవకాశం వస్తే తప్పకుండా వెళ్లుతానని సందర్భంగా చంద్రముఖీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మంది అభిమానులు నన్ను బిగ్‌బాస్‌కు రమ్మని సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారనే విషయాన్ని కూడా ఈమె తెలిపారు. అవకాశం వస్తే వెళ్తాను. రాకపోతే బాధపడను. బిగ్‌బాస్ సీజన్ 3కి నాకు అవకాశం వచ్చిందని.. అప్పుడు కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఈ అవకాశాన్ని వదులుకున్నట్టు వెల్లడించారు.