Home » Train Alchohal: ట్రైన్లో మద్యం తీసుకెళ్లవచ్చా.. రూల్స్ ఏమంటున్నాయంటే..?

Train Alchohal: ట్రైన్లో మద్యం తీసుకెళ్లవచ్చా.. రూల్స్ ఏమంటున్నాయంటే..?

by Sravanthi

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే సంస్థగా ఇండియా మంచి పేరు సంపాదించుకుంది. దేశవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ప్రయాణికులు రైల్వే ద్వారా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. మరి ఈ ప్రయాణాలు చేసేటప్పుడు ప్రతి ప్రయాణికులు రకరకాల లగేజీని తీసుకెళ్తూ ఉంటాడు. అయితే రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎంత పరిమాణంలో ఆల్కహాల్ తో ప్రయాణం చేయవచ్చు అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. మీరు రైల్లో మద్యం తీసుకుని ప్రయాణించవచ్చు. కానీ ప్రతి చోటా కాదు. ఇది ఏ రాష్ట్రానికి వెళ్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. మద్యానికి సంబంధించి పాలసీ తీసుకునే హక్కును రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించింది.

also read:ఆ మూవీ ని వరుణ్ తేజ్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదా..?

కాబట్టి మీరు ట్రైన్లో మద్యంతో ప్రయాణించవచ్చా లేదా అనేది ఆయా రాష్ట్రాల పాలసీపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఢిల్లీ నుంచి బీహార్ కు ప్రయాణిస్తున్నట్లయితే మీరు మద్యంతో రైలు ఎక్కువచ్చు.కానీ బీహార్ సరిహద్దుల్లోకి ప్రవేశించే ముందు దాన్ని దించవలసి ఉంటుంది. బీహార్ లోని ఏదైనా స్టేషన్లో దిగి తనిఖీ చేసేటప్పుడు మద్యం ఉన్నట్లు తేలితే ఇబ్బందుల్లో పడతారు. ఇక గుజరాత్ వెళ్లే వారికి కూడా ఇదే వర్తిస్తుంది. రైలులో తీసుకెళ్లే మద్యానికి ఎలాంటి పరిమితి.

2019 లో దాఖలు చేసిన ఆర్టిఐ కి సమాధానంగా రైల్వే అధికారులు మద్యం రవాణాకు సంబంధించి లిఖిత పూర్వక నియమం లేదని నిర్ధారణకు వచ్చారు. రైల్లో నిర్దిష్ట పరిమితి మద్యం తీసుకెళ్లడానికి ఎటువంటి పరిమితి లేదు. కానీ అంతకంటే ఎక్కువ తీసుకెళ్తే దానికి ఎక్సైజ్ పాలసీ ప్రకారం జరిమానా విధించబడుతుంది. ఒకవేళ ఈ మద్యం బాటిల్స్ తెరిచి ఉంటే మాత్రం శాంతి భద్రతలకు బంధం కలిగించినందుకు ఆర్పిఎఫ్ ఆ ప్రయాణికుడికి జరిమానా విధించవచ్చు. ఈ విధంగా రైల్లో దూర ప్రయాణం చేసేటప్పుడు మద్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

also read:ఓపెనింగ్ డే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 సౌత్ మూవీలు ఇవే..!

Visitors Are Also Reading