Home » రావి చెట్టును ఏ రోజుల్లో తాకితే పాపం కలుగుతుంది..!!

రావి చెట్టును ఏ రోజుల్లో తాకితే పాపం కలుగుతుంది..!!

by Sravanthi
Ad

భారతదేశ సాంప్రదాయం ప్రకారం మనం రాళ్లను,చెట్లను కూడా పూజిస్తూ ఉంటాము. ముఖ్యంగా గుడిలో ఉండే చెట్ల లో రావిచెట్టును అత్యంత భక్తితో కొలుస్తారు. అయితే ఈ రావి చెట్టు గురించి ఈ విషయాలు తెలుసుకోండి. వృక్షాలలో రావి చెట్టును దేవతా స్వరూపం అని అంటారు. రావి చెట్టు ని చూస్తే భక్తి భావం కలుగుతుంది. అయితే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ చెట్టును తాక వచ్చా లేదా అనే అనుమానం ప్రతి ఒక్కరి లో ఉంటుంది. ఈ రావిచెట్టు ని ఎలా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఒక శుభముహూర్తంలో స్నాన మాచరించి శుభ్రతతో రావిచెట్టును పూజించాలి. దానికి ముందు ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించి విభూతి గాని కుంకుమ గాని పెట్టుకోవాలి. ముందుగా గణపతిని పూజించి సంకల్పం చెప్పి ఆ తర్వాత రావిచెట్టుకు భక్తితో ఏడుసార్లు అభిషేకం చేయాలి. తర్వాత విష్ణు సహస్రనామం చదువుతూ గాని, లేదా మౌనంగా గాని నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదర్శనకు ముందు చివర నమస్కారం చేయాలి. ఇలా చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆది, మంగళవారాల్లో రావిచెట్టును అస్సలు తాకకూడదు. అంతేకాకుండా సంధ్యా సమయంలో కూడా రావిచెట్టును ముట్టుకోకూడదు. అలా చేస్తే దోషం కలుగుతుంది. కేవలం శనివారం రోజు మాత్రమే ఈ వృక్షాన్ని తాకాలని సూచిస్తున్నారు. ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే మనసులో అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే రావి చెట్టును నరికేస్తే మహా పాపం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

Advertisement

ALSO READ :

Advertisement

గుడిలో తీర్థం తీసుకొని తలకు అద్దుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!

సూర్యగ్రహణ సమయంలో ఈ మూడు రాశుల వారు జాగ్రత్త..!

 

 

Visitors Are Also Reading