Home » గుడిలో తీర్థం తీసుకొని తలకు అద్దుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!

గుడిలో తీర్థం తీసుకొని తలకు అద్దుకుంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే..!!

Ad

దేవాలయానికి వెళ్లే ప్రతి భక్తుడు తప్పక దేవుని అనుగ్రహం కోసం తీర్థం తీసుకుంటారు. అయితే ఈ తీర్ధాన్ని మూడు సార్లు ఇస్తారు. అంతేకాదు తీర్థం తీసుకునేటప్పుడు ఎడమ చేతిలో కుడిచేతిని పెట్టి చేయి చాపడం చూస్తుంటాం. మరి దీని వెనుక రహస్యం ఏంటో తెలుసుకుందాం..అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయం కరణం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అని చెబుతారు. దీని అర్థం ఏంటంటే అకాల మరణాన్ని తప్పించే శక్తి, అన్ని రోగాల నివారణకు పాపక్షయం కాబట్టి తీర్ధాన్ని పవిత్రమైన మనసుతో స్వీకరిస్తే తప్పక శుభాలు కలుగుతాయని అర్థం. పురాణాల ప్రకారం తీర్థం అంటే తరింపచేసేది అని అర్థం. దీన్ని మూడు సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తి వస్తుంది. కుడి చేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి.అలాగే కుడి చేయి చూపుడు వేలు మధ్యలోకి బొటనవేలి మలిస్తే గోముఖం అనే ముద్ర వస్తుంది. ఈ ముద్రతో తీర్ధాన్ని తీసుకోవాలి. చాలామంది తీర్ధం తీసుకున్నాక తలపై తూడ్చుకుంటారు. కానీ అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ దేవుడు ఉంటాడు. అలాచేస్తే మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వాళ్లమవుతాం. కాబట్టి కళ్ళకు అద్దుకోవడం మాత్రమే చేయాలి. తీర్థంలో గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర అనే ఐదు పవిత్ర నదుల శక్తి ఉంటుంది. అందుకే తీర్ధాన్ని భగవత్ ప్రసాదంగా. స్వీకరించాలి.

Advertisement

ALSO READ :

Advertisement

ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతం జరగబోతోంది.. వారు ఎవరంటే..!!

సూర్యగ్రహణ సమయంలో ఈ మూడు రాశుల వారు జాగ్రత్త..!

 

 

 

Visitors Are Also Reading