Home » కరోనా వ్యాక్సిన్లతో చాలా సైడ్ ఎఫెక్ట్స్.. విస్తుపోయే విషయాలు వెల్లడించిన కేంద్రం..!

కరోనా వ్యాక్సిన్లతో చాలా సైడ్ ఎఫెక్ట్స్.. విస్తుపోయే విషయాలు వెల్లడించిన కేంద్రం..!

by Anji
Ad

కరోనా వైరస్ ని కట్టడి చేయడం కోసం.. కరోనా మహమ్మారి నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ లను యుద్ధప్రాతిపదికన తయారు చేసి శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీని ద్వారా కొంత వరకు మరణాలను ఆపడంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సక్సెస్ అయ్యాయనే చెప్పవచ్చు. కానీ కరోనా నియంత్రణ కోసం తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ లతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కేంద్రం తాజాగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. 

Advertisement

కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్ట్ గురించి తెలియజేయాలని పూణేకు చెందిన ఓ వ్యాపారవేత్త దాఖలు చేసిన పిటిషన్ కి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇచ్చిన జవాబులో పలు కీలక విషయాలను వెల్లడించారు. రైట్ టూ ఇన్పర్మేషన్ కింద దాఖలు చేసిన పిటిషన్ కి బదులు ఇస్తూ కేంద్రం ఇచ్చిన సమాచారం దేశ ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది. అసలు కేంద్రం ఏం చెప్పిందంటే.. భారతదేశంలో కరోనా కట్టడి కోసం తీసుకున్నటువంటి కోవిషీల్డ్, కోవోవ్యాక్స్, కో వ్యాక్సిన్, ఆస్ట్రాజెనికా, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్లతో సైడ్ ఎఫెక్ట్ చాలా ఉన్నాయని వెల్లడించింది. 

కోవి షీల్డ్  :

Covid-19 vaccination: India signs purchase order with Serum; 'Covishield'  vaccine to cost ₹200 per dose | Mint

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ  వ్యాక్సిన్ ఇచ్చిన చోట చాలా నొప్పిగా ఉంటుందని.. శరీరంపై అక్కడక్కడ ఎర్రని మరకలు పడుతాయని, అకారణంగా వాంతులు కావడం, తీవ్రమైన కడుపునొప్పి రావడం, తలనొప్పి రావడం, శ్వాస తీసుకోవడం ఇబ్బందులు, అవయవాల నొప్పి, చాతి నొప్పి, కళ్ల నొప్పులు, కళ్లు మసకగా కనిపించడం, బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. 

కో వ్యాక్సిన్  :

Covaxin: India approves two Covid vaccines for children under 12 - BBC News

కో వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ విషయానికొస్తే.. ఈ ఇంజక్షన్ ఇచ్చిన చోట వాపు లేదా నొప్పి రావడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. తలనొప్పి, అలసట, జ్వరం, ఒళ్లు నొప్పులు, కడుపునొప్పి, వాంతులు, వణుకు, చెమటలు పట్టడం, తల తిరగడం, దగ్గు, జలుబు తేలికపాటి లక్షణాలు కో వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కనిపిస్తుందని చెబుతున్నారు.  

Advertisement

Also Read :  శీతాకాలంలో వాకింగ్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్తలు తప్పనిసరి..!

కోవో వ్యాక్స్ :

Manam News

కోవోవ్యాక్స్ సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్టయితే.. నొప్పిగా అనిపించడం, శరీరం చాలా సున్నితంగా మారడం, అలసట, జ్వరం, కీళ్ల నొప్పులు, వాంతులు, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, చలి జ్వరం, వ్యాక్సిన్ తీసుకున్న చోట దురద, దద్దుర్లు రావడం వంటి చర్మం ఎర్రగా మారడం, వెన్నునొప్పి, మత్తుగా ఉండటం వంటి పలు లక్షణాలు కనిపిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంట్రల్ Dra గ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సమాధానం ఇచ్చాయి.  

Also Read :  దిష్టి కోసం మీ పిల్లలకు నల్లదారం కడుతున్నారా..? ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి..! 

స్పుత్నిక్ వి  :

Manam News

స్పుత్నిక్ వి విషయానికొస్తే.. స్పుత్నిక్ వి సైడ్ ఎఫెక్ట్స్ ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి లేదా వాపు రావడం, వికారంగా అనిపించడం, అజీర్తి సమస్య, ఆకలి వేయకపోవడం, చలిజ్వరం, మయాల్షియా, ఆస్తేనియా వంటి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించిన వ్యక్తి కేంద్రం ఇచ్చిన సమాధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ పూర్తిగా పౌరుల స్వచ్ఛందానికి వదిలేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే.. విమానాల్లో అనుమతించమని.. హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ లోకి అనుమతించబోమని ప్రభుత్వం చెప్పడంతో సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోకుండా.. చాలా మంది వ్యాక్సినేషన్ తీసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేసారు. చాలా మంది వ్యాక్సినేషన్ కారణంగా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారని పేర్కొంటున్నారు.  

Also Read :   మనిషి నవ్వడం వెనుక ఉన్న శాస్త్రీయ కారణం మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading