Telugu News » Blog » మన స్టార్ హీరోల అసలు పేర్లు ఏంటో మీకు తెలుసా..?

మన స్టార్ హీరోల అసలు పేర్లు ఏంటో మీకు తెలుసా..?

by Manohar Reddy Mano
Ads

మన దేశంలో సినిమా హీరోలను దేవుళ్లుగా భావిస్తుంటారు అభిమహులు. సినిమా విడుదల ముందు వారి పేర్ల పైన పూజలు చేయించడం.. వారి పుట్టిన రోజునాడు పలు కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే ఇలా హీరోల పేరు మీద పూజలు చేయించే చాలా మంది అభిమానులకు ఆ హీరోల అసలు పేరు ఏంటి అనేది తెలియదు.

Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో మొదటి స్థానంలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమానుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అందులో ఎంతమందికి ఆయన అసలు పేరు శివశంకర వరప్రసాద్ అని తెలుసు. అలాగే ఒకే ఏడాదిలో 15 సినిమాలు విడుదల చేసిన సూపర్ స్టార్ కృష్ణ అసలు పేరు రామకృష్ణ. ఇక రజినీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్. పొలిటికల్, సినిమా లైఫ్ ను ఒక్కేసారి నడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు.

Ads

Ad

ఇక బాహుబలితో పాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్ పేరు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. అలాగే మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సల నాయుడు. కమల్ హాసన్ అసలు పేరు పార్ధసారధి శ్రీనివాసన్. రవితేజ అసలు పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. జగపతి బాబు అసలు పేరు జగపతి రావు. సునీల్ అసలు పేరు సునీల్ వర్మ.