సినిమా హీరోలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఆ హీరోలు కూడా మనుషులే. అయితే మనుషులకు బలహీనతలు అనేవి ఉంటాయి. అలాగే హీరోలకు కూడా ఉంటాయి. కానీ వ్యక్తిగత బాలాగినతలు కాకుండా మన టాలీవుడ్ లో ఉన్న కొందరు హీరోలకు సినిమాల విషయంలో ఉండే బలహీనతలు అనేవి ఏంటో చూద్దాం.
Advertisement
టాలీవుడ్ లో నాచురల్ స్టార్ నాని హీరోగా ఎంతో మందికి ఇష్టం. ఈయన చేసే సినిమాలు కూడా వరుసగా 8 హిట్ అందుకున్నాయి. కానీ సినిమాల విషయంలో నానికి ఉన్న బలహీనత అంటే కొత్త హీరోయిన్. నాని ఇప్పటివరకు 10 మంది కొత్త హీరోయిన్స్ ను పరిచయం చేసాడు. ఇక మరో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం స్టార్ డమ్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈయనకు కూడా ఓ బలహీనత ఉంది.
Advertisement
కానీ ఈయన బలహీనత అనేది నానికి పూర్తిగా విరుద్ధం. బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పుడు తన సినిమాలో స్టార్ హీరోయిన్ ఉండాలనే అనుకుంటాడు. అందుకే తన మొదటి సినిమా అల్లుడు శ్రీనులో కూడా ఆయన అప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సమంతను పెట్టుకున్నాడు. ఇక టాలీవుడ్ లోని సీనియర్ హీరో అయిన బాలకృష్ణ బలహీనత అనేది ఆయన సినిమాల పేర్లను చూస్తేనే అర్ధం అవుతుంది. సింహ అనేది బాలయ్య బలహీనత. ఇది ఆయన సినిమా టైటిల్ లో పెట్టేందుకు 100 శాతం ప్రయత్నిస్తాడు.
ఇవి కూడా చదవండి :