Home » విరాట్ రికార్డులు.. డబుల్ సెంచరీకి ఒక్క అడుగు దూరంలో..!

విరాట్ రికార్డులు.. డబుల్ సెంచరీకి ఒక్క అడుగు దూరంలో..!

by Azhar
Ad

గత ఏడాది టీ20 ప్రపంచ కప్ సమయంలో ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లీ ఈ ఏడాది ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో చెలరేగుతున్నాడు. సెప్టెంబర్ లో జరిగిన ఆసియా కప్ లో ఫామ్ లోకి వచ్చిన విరాట్.. అప్పటి నుండి మళ్ళీ పరుగుల వరద అనేది పారిస్తున్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో కోహ్లీ తన బ్యాట్ తో చాలా రికార్డులు అనేవి క్రియేట్ చేసాడు.

Advertisement

అయితే ప్రపంచ కప్ లో ఈరోజు బంగ్లాదేశ్ పై విరాట్ 64 పరుగులు చేసాడు. దాంతో ఈ పోటీ ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఈ హాఫ్ సెంచరీ విరాట్ కు 2022 ప్రపంచ కప్ లో మూడో హాఫ్ సెంచరీ. అయితే ఇలా పోటీ ప్రపంచ కప్ టోర్నీలో మూడు.. అంత కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేయడం కోహ్లీకి ఇది మూడోసారి. మారె ఆటగాడు కూడా ఈ ఫిట్ అనేది అందుకోలేదు.

Advertisement

ఇక అదే విధంగా బంగ్లా పై చేసిన ఈ హాఫ్ సెంచరీ విరాట్ కు అంతర్జాతీయ కెరియర్ లో 199వ హాఫ్ సెంచరీ. ఇంకా ఒక్క అర్ధ శతకం అనేది చేస్తే విరాట్ 200 హాఫ్ సెంచరీలు పూర్తి అవుతాయి. అయితే సెంచరీల విషయంలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న కోహ్లీ.. ఈ హాఫ్ సెంచరీల విషయంలో సచిన్, రికీ పాంటింగ్, సంగర్కర , కలీస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి :

సూర్యను అందుకోవడం పాక్ ప్లేయర్స్ వల్ల అవుతుందా..?

ఇండియా మళ్ళీ చీటింగ్ చేసిందంటున్న పాకిస్థాన్..!

Visitors Are Also Reading