Home » 2022లో విడుదలకానున్న సీక్వెల్ సినిమాలు ఇవే..!

2022లో విడుదలకానున్న సీక్వెల్ సినిమాలు ఇవే..!

by AJAY
Ad

ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ హవా కనిపిస్తోంది. కొన్ని సినిమాలు పూర్తయిన తర్వాత సీక్వెల్స్ ను ప్లాన్ చేస్తే మరికొన్ని చిత్రాలకు ముందుగానే సీక్వెల్స్ ను ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన పుష్ప సినిమాను మొదట ఒకే పార్ట్ గా విడుదల చేయాలనుకున్నారు. కానీ బడ్జెట్ ఎక్కువ అవ్వ‌డం… సినిమా కథ లెంథీగా ఉండడంతో రెండు పార్టులుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా పార్ట్2 చిత్రీకరణ కూడా ప్రారంభం కానుంది. ఈ చిత్రం కూడా 2022లో విడుద‌ల్యే అవ‌కాశం ఉంది. పుష్ప‌తో పాటూ మ‌రో 5 సినిమాల సీక్వెన్స్ చిత్రీకరణ ద‌శ‌లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

మంచు విష్ణు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఢీ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. ఢీ అంటే ఢీ టైటిల్ తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా 2022 లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

నిఖిల్ హీరోగా స్వాతి హీరోయిన్ గా తెరకెక్కిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కార్తికేయ‌-2 తెరకెక్కుతోంది. ఈ చిత్రం కూడా 2022లో విడుదల కానుంది.

 

ఎఫ్-3 అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ఎఫ్-2 సినిమా థియేటర్లలో నవ్వులు పూయించింది. ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. 2022 లో ఈ సినిమా విడుదల కానుంది.

నాగార్జున హీరోగా నటించిన.. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో నాగార్జున హీరోగా నటిస్తుండగా నాగచైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా 2022 లో విడుదల కానుంది.

Hit 2 first glimpse released

Hit 2 

విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా హిట్ -2 తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా 2022 లో విడుదల కానుంది.

Visitors Are Also Reading