Home » స్క్రీన్ పై తెల్ల జుట్టుతో కనిపించేందుకు రెడీ అవుతున్న సీనియర్ హీరోలు…ఆ సినిమాలు ఏవంటే..?

స్క్రీన్ పై తెల్ల జుట్టుతో కనిపించేందుకు రెడీ అవుతున్న సీనియర్ హీరోలు…ఆ సినిమాలు ఏవంటే..?

by AJAY
Ad

నడుస్తున్న ట్రెండ్ ను బట్టి హీరోలు కూడా తమ రూటు మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పటికే తమిళ హీరో అజిత్ టాలీవుడ్ లో జగపతిబాబు తెల్లబడిన జుట్టు గడ్డంతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇప్పుడు అదే బాటలో టాలీవుడ్ స్టార్ హీరోలు నడుస్తున్నారు. తమ రాబోయే సినిమాల్లో తెల్ల జుట్టుతో గడ్డంతో కనిపించబోతున్నారు. ఆ హీరోలు ఎవరు..? ఆ సినిమాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం…..


గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. కాగా బాలయ్య ఈ టీజర్ లో తెల్ల జుట్టుతో మరియు గడ్డంతో కనిపిస్తున్నారు. కానీ ఈ లుక్ మాత్రం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisement


మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా కాంబినేషన్ లో గాడ్ ఫాదర్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో చిరంజీవి తెల్ల జుట్టుతో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ కూడా మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది.

ఫ్యామిలీ హీరో వెంకటేష్ కూడా తెల్ల జుట్టుతో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు. వెంకటేష్ రానా కలిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను రీసెంట్ గా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో వెంకటేష్ తెల్ల జుట్టుతో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ కు కూడా విక్టరీ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది.

Visitors Are Also Reading