స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది. మన టాలీవుడ్ లో బాక్సింగ్ నేపథ్యంలో తక్కువ సినిమాలు వస్తుంటాయి.
Advertisement
రీసెంట్ గా లైగర్ సినిమా కూడా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఇక ఇప్పటి వరకూ టాలీవుడ్ లో బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…
ఇవి కూడా చదవండి: మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసిన 8 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవే..!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు సినిమా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. చిన్న వయసులోనే కరాటే నేర్చుకున్న పవన్ కల్యాణ్ ఈ సినిమాలో తన నటనతో అదరగొట్టారు.
పవన్ కు కిక్ బాక్సింగ్ అన్నా కరాటే అన్న చాలా ఇష్టం. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ మరో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో నటించారు. ఆ సినిమానే జానీ ఈ సినిమా భారీ అంచనాల నడుమ వచ్చినప్పటికీ ఆ అంచనాలను రీచ్ అవ్వలేకపోయింది.
Advertisement
పూరీజగన్నాత్ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన సినిమా అమ్మానాన్న ఓ తమిళమ్మాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది.
బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన సాలా కుద్దూస్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో మాదవన్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాలో రితికా సింగ్ హీరోయిన్ గా నటించింది. బాక్సర్ గా రితిక సింగ్ అదరగొట్టింది. ఇదే చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ ప్రధాన పాత్రలో గురు పేరుతో తెరకెక్కించగా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని సినిమా ఇటీవల విడుదలైంది. ఈ సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది. కానీ ఈ సినిమా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది.
తమిళ హీరో ఆర్య నటించిన సారపట్ట సినిమా కూడా బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఇవి కూడా చదవండి: ఈ ఫోటో ఎప్పటిది..? దీని వెనుక ఉన్న కథ గురించి మీకు తెలుసా..?