Home » ఈ టాలీవుడ్ హీరోల ఇంటి ధ‌ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఈ టాలీవుడ్ హీరోల ఇంటి ధ‌ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by AJAY
Ad

రోజంతా షూటింగ్ ల‌తో బిజీగా గడిపే హీరోలు ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. అందుకోసం విశాలమైన ఇళ్లను కట్టుకుంటారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో చాలా మందికి కోట్ల ఖరీదు చేసే ఖ‌రీదైన ఇల్లులు ఉన్నాయి. అలా ఖరీదైన ఇల్లు ఉన్న హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Mahesh babu

Mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో విశాలమైన భవనం ఉంది. ఆ ఇల్లు ధర 20 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హైదరాబాదులో రెండు ఇల్లులు ఉన్నాయి. వాటిలో ఒకటి మెహదీపట్నంలో ఉండగా ఎన్టిఆర్ చిన్ననాటి నుండి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటి ధర 30 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అంతేకాకుండా జూబ్లీహిల్స్ లో ఎన్టీఆర్ కు 40 కోట్ల ఖరీదు చేసే మరో ఇల్లు కూడా ఉంది.

Advertisement

prabhas

prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఫిలింనగర్ లో విశాలమైన భవనం ఉంది. ఈ ఇంటి ధర దాదాపు 35 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగానే ప్రభాస్ రీసెంట్ గా మ‌రో రెండున్నర ఎకరాలు హైద‌రాబాద్ లో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ramcharan

ramcharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జూబ్లీహిల్స్ లో ఖ‌రీదైన భ‌వ‌నం ఉంది. ఈ ఇంటిని రామ్ చ‌ర‌ణ్ కు ఉపాసన గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక ఈ ఇంటి ధర దాదాపు రూ.80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

vijay dewarakonda

vijay dewarakonda

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిల్మ్ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి ధ‌ర‌ దాదాపు రూ.30 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

ALLU ARJUN

ALLU ARJUN

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు హైదరాబాద్ జూబ్లీహిల్స్ తో ఒక భవనం ఉంది. ఆ ఇంటి ధర దాదాపు రూ. 50 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదే కాకుండా అల్లు అర్జున్ మ‌రో ఇంటిని క‌డుతున్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading