లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఇంకా ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలు అన్నీ తమ అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో లోక్‌సభ అభ్యర్థులను విడతలవారీగా ప్రకటిస్తుండగా.. తాజాగా టీఎంసీ తరఫున పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థుల జాబితాను మమతా బెనర్జీ ప్రకటించారు. 42 మంది అభ్యర్థుల జాబితాను దీదీ ప్రకటించగా.. ఇందులో క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌తో పాటు బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హాకు కూడా టికెట్ ఇచ్చారు. అయితే ఈ జాబితాలో ప్రముఖ తెలుగు హీరోయిన్ కూడా టికెట్ దక్కించుకోవడం విశేషం.
Advertisement
Advertisement
రచన బెనర్జీకి పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నుంచి మమతా బెనర్జీ ఎంపీ సీటు కేటాయించింది. రచన బెనర్జీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో బావగారూ బాగున్నారా!, శ్రీకాంత్‌తో కన్యాదానం, జగపతిబాబుతో మావిడాకులు వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషల్లోనూ రచన పలు సినిమాల్లో నటించింది. కొంతకాలంగా సినిమాలకు దూరమైన రచన.. బెంగాలీ సీరియల్స్, టీవీ షోలకు పరిమితమైంది. అలాగే టీఎంసీ తరఫున రాజకీయాల్లోనూ బిజీగానే గడిపేస్తోంది. కాగా, గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన హీరోయిన్ నుస్రత్ జహాన్‌కు ఈసారి మొండి చేయి ఎదురైంది.
Also Read : చిరంజీవి-బాలకృష్ణ కాంబినేషన్ రావాల్సిన ఆ పౌరాణిక మూవీ మిస్ కావడానికి కారణం ఏంటో తెలుసా ?