సెలబ్రెటీలు కేవలం సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తుంటారు. టీవీలలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసి డబ్బులు సంపాదించే సెలబ్రెటీలను కూడా మనం చూసాం. కానీ మన టాలీవుడ్ లో కొంతమంది సెలబ్రెటీలు కోట్ల ఆఫర్లు వచ్చినా బ్రాండ్ ప్రమోషన్ లు మాత్రం చేయమని తెగేసి చెబుతున్నారు. అలా బ్రాండ్ ప్రమోషన్స్ కు దూరంగా ఉన్న సెలబ్రెటీలు ఎవరో చూద్దాం.
ALSO READ : డైరెక్టర్ తేజ కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఈ సినిమాలలో నటించారని మీకు తెలుసా ?
Advertisement
నటసింహం నందమూరి బాలయ్య టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. కానీ బాలయ్య బ్రాండ్ ప్రకటనలకు దూరంగా ఉంటారు. ఏదైనా మంచి పని కోసం ఫ్రీగానైనా ప్రచారం చేస్తా కానీ బ్రాండ్ లకు మాత్రం ప్రచారం చేయనని బాలయ్య చెబుతున్నారు.
టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సాయిపల్లవి వద్దకు కూడా ఎన్నో బ్రాండ్ లు ప్రమోషన్స్ చేయాలని వచ్చాయట. కానీ తాను వాడకుండా ఇతరులకు ఎలా చెబుతానని సాయి పల్లవి నో చెప్పిందట.
Advertisement
డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఒకప్పుడు స్టార్ హీరోగా కొనసాగారు. అయినా కూడా బ్రాండ్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటారు. తన వద్దకు ఎన్నో ఆఫర్ లు వచ్చినా నో చెప్పారట. మోహన్ బాబు మాత్రమే కాకుండా ఆయన వారసులు కూడా బ్రాండ్స్ ను ప్రమోట్ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం చెప్పుకోదగ్గ విషయం.
టాలీవుడ్ బ్యూటీ అనుష్క కూడా బ్రాండ్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటుంది. ఇప్పటికీ అనుష్క క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు..అయినా బ్రాండ్ ప్రమోషన్స్ కు మాత్రం అనుష్క ముందు నుండి దూరంగానే ఉంటుంది.
అల్లరి నరేష్ కు కూడా ప్రమోషన్స్ అంటే ఇష్టం లేదట. ఆయన వద్దకు కూడా ఎన్నో ఆఫర్ లు వచ్చినా ఆయన వాటిని తిరస్కరించారట.
మెగామేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు కూడా బ్రాండ్ ప్రమోట్ చేయాలని కోట్లు ఆఫర్ చేశారట. కానీ తేజ్ వాటిని రిజెక్ట్ చేశారట.