Home » భారీ బంగళాలు ఉన్నా అద్దె ఇళ్లలో ఉంటున్న సెలబ్రిటీలు వీరే..!

భారీ బంగళాలు ఉన్నా అద్దె ఇళ్లలో ఉంటున్న సెలబ్రిటీలు వీరే..!

by AJAY
Published: Last Updated on
Ad

సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ సొంత ఇల్లు ఉండాల‌ని క‌ల‌లు కంటూ ఉంటారు. అద్దె ఇంట్లో ఉండ‌కూడ‌ద‌ని తాము న‌చ్చిన‌ట్టుగా ఒక ఇల్లు క‌ట్టుకుని అందులోనే ఉండాల‌ని అనుకుంటారు.

Advertisement

అలాగే ఇప్పుడు టాలీవుడ్ సెల‌బ్రెటీల‌కు కూడా చాలామందికి లంకంత కొంప‌లు ఉన్నాయి. మ‌రికొంద‌రికి సొంత ఇండ్ల తో పాటూ గెస్ట్ హౌస్ లు కూడా ఉన్నాయి. అయితే సొంత ఇల్లు ఉన్న కొంత‌మంది ప్ర‌ముఖులు సైతం అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అలా సొంత ఇల్లు ఉండి కూడా అద్దె ఇంట్లో ఉంటున్న టాలీవుడ్ ప్రముకులు ఎవ‌రో ఇప్పుడు చూద్దాం…

Mahesh babu

Mahesh babu

టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబుకు జూబ్లిహిల్స్ లో అతిపెద్ద భ‌వ‌నం ఉంది. కానీ మ‌హేశ్ బాబు జువెనిస్టిక్ కాల‌నీలో ఉన్న త్రిబుల్ బెడ్రూం ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. అంతే కాకుండా మ‌హేశ్ బాబు ఇంటికి ముందు ఆయ‌న సోద‌రి కూడా ఉంటున్నారు.

Nagachaitanya

Nagachaitanya

అక్కినేని హీరో నాగ‌చైత‌న్య కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. ఎన్నో ఆస్తిపాస్తులు ఉన్నాకూడా చైత‌న్య అబిడ్స్ మాల్ వ‌ద్ద ఉండే ఓ సాదా సీదా ఫ్లాట్ లో ఉంటున్నాడు. నాగ‌చైత‌న్య త‌న రెండు సినిమాలు పూర్త‌యిన నాటి నుండే ఈ ఇంట్లో ఉంటున్నాడు. పెళ్లి త‌ర‌వాత స‌మంతతో కూడా ఇదే ఇంట్లో ఉన్నాడు. అయితే త‌న త‌ల్లి ద‌గ్గుబాటి ల‌క్షి ఆ ఇంటికి ఇంటీరియ‌ర్ డిజైన్ చేసింద‌న్న సెంటిమెంట్ తోనే చైతూ ఆ ఇంటిని వ‌ద‌ల‌డం లేద‌ట‌.

Advertisement

Pawan kalyan

Pawan kalyan

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కు కూడా నంద‌గిరి హిల్స్ లో లంకంత భ‌వ‌నం ఉంది. కొంతకాలం పాటూ అక్క‌డే ఉన్నారు. కానీ మ‌ట్టిమీద ఉన్న మ‌మ‌కారంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ఫామ్ హౌస్ లో ఉంటున్నారు.

Jagapati babu

Jagapati babu

జ‌గ‌ప‌తి బాబుకు అపోలోకు ద‌గ్గ‌రలో వెయ్యి గ‌జాల స్థ‌లంలో పెద్ద భంగ్లా ఉంది. కానీ జ‌గ‌ప‌తిబాబు ఆ బంగ్లాలో ఉండ‌కుండా కూక‌ట్ ప‌ల్లిలోని లోట‌స్ ట‌వ‌ర్ లోని ఓ ఫ్లాట్ లో ఉంటున్నారు.

Rajamouli

Rajamouli

ద‌ర్శ‌క‌ధీరుడు జ‌క్క‌న్న పెళ్లైన మొద‌టి నుండి మ‌ణికొండ‌లోనే ఉంటున్నాడు. మొద‌ట్లో రాజ‌మౌళి ఓ విల్లాలో ఉండేవారు కానీ ఆ త‌ర‌వాత విల్లాను అద్దెకు ఇచ్చి మణికొండ‌లోనే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటున్నారు.

Also Read: 2020లో వివాదాల్లో నిలిచిన బాలీవుడ్ తారలు వీరే…!

Visitors Are Also Reading