Home » టాలీవుడ్ లో బిజీగా ఉన్న 5గురు లేడీ యాంక‌ర్స్ భ‌ర్త‌లు ఎలా ఉంటారు..? ఏం చేస్తారో తెలుసా..?

టాలీవుడ్ లో బిజీగా ఉన్న 5గురు లేడీ యాంక‌ర్స్ భ‌ర్త‌లు ఎలా ఉంటారు..? ఏం చేస్తారో తెలుసా..?

by AJAY
Ad

సినిమా ఆడియో ఫంక్షన్ చేయాలన్నా… టీవీ షోలు చేయాలన్నా యాంకర్స్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే యాంకర్స్ లో మెయిల్ యాంకర్స్ కంటే ఫిమేల్ యాంకర్స్ కి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. టాలీవుడ్ లో చాలామంది ఫిమేల్ యాంకర్స్ ఉన్నారు. ప్రస్తుతం అందులో కొంతమంది సినిమాల్లోనూ రాణిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో రాణిస్తున్న యాంకర్స్ పర్సనల్ విషయాలు మాత్రం కొంతమందికే తెలుసు. కాబట్టి టాలీవుడ్ యాంకర్స్ భర్తలు ఎవరు ఏం చేస్తారు అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Advertisement

Also Read: మంచి పాత్ర‌ల‌ను రిజెక్ట్ చేసి న‌ష్ట‌పోయిన 10 మంది న‌టీమ‌ణులు వీళ్లే..ఎందుకు రిజెక్ట్ చేశారంటే..?

టాలీవుడ్ లో నంబర్ వన్ స్థానంలో ఉన్న‌ యాంకర్ సుమ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు టీవీ షో లతోపాటు సుమ ఆడియో ఫంక్షన్ల‌ తోనూ ఫుల్ బిజీగా ఉంటారు. సుమ భర్త గురించి మాత్రం చాలామందికి తెలుసు. సుమ‌ భర్త పేరు రాజీవ్ కనకాల కాగా ఆయన కూడా ఇండస్ట్రీలో ఫేమస్ నటుడు అన్న సంగతి తెలిసిందే.

Kerala floods: Suma and Rajeev Kanakala generosity

యాంకర్ అనసూయ కూడా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్నారు. అయితే అన‌సూయ‌ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇక అనసూయ భర్త విషయానికి వస్తే స్కూల్ ఏజ్ లోనే జబర్దస్త్ బ్యూటీ రిషి భర‌ద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రిషి భ‌రద్వాజ్ బిజినెస్ చేస్తుంటారు.

Advertisement

యాంకర్ అనసూయ

యాంకర్ అనసూయ

తెలుగులో యాంకర్ ఝాన్సీ కి కూడా మంచి గుర్తింపు ఉంది. ఝాన్సీ పెద్ద హీరోల సినిమాలకు యాంకరింగ్ చేయడంతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్నారు. ఇక యాంకర్ ఝాన్సీ కూడా టాలీవుడ్ నటుడు కమెడియన్ జోగి నాయుడును పెళ్లి చేసుకుంది. కానీ వ్యక్తిగత కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారు.

యాంకర్ ఝాన్సీ

యాంకర్ ఝాన్సీ

Also Read: పెళ్లయిన స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకుంటారో తెలుసా..?

హృదయాంజలి టీవీ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ఉదయభాను ఆ తర్వాత తెలుగులో టాప్ యాంకర్ గా ఎదిగారు. కానీ వ్యక్తిగత కారణాలవల్ల ఉదయభాను చాలా కాలం ఇండస్ట్రీకి దూరమయ్యారు. ప్రస్తుతం మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చి బిజీ అయ్యారు.

ఉదయభాను

ఉదయభాను

ఉదయభానుకు మొదట ఓ వ్యక్తితో వివాహం కాగా కొన్నాళ్లకు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత విజయ్ అనే మరో వ్యక్తిని ఉదయభాను పెళ్లి చేసుకుంది. ఆయ‌న రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. వీరిద్దరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

లాస్య

లాస్య

సంథింగ్ స్పెషల్ అనే టీవీ షో ద్వారా లాస్య ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత లాస్య ప‌లు టీవీ షోల‌తో ఫుల్ బిజీగా మారింది. లాస్య‌ కన్నవాళ్లను సైతం ఎదిరించి తాను ప్రేమించిన మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. మంజునాథ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

Also Read:  మీరు కూడా స‌మంతలా చేయ‌కండి అంటూ నెటిజన్ సెటైర్…దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన అష్షు రెడ్డి..!

Visitors Are Also Reading