Home » పెళ్లయిన స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకుంటారో తెలుసా..?

పెళ్లయిన స్త్రీలు నల్లపూసలు ఎందుకు వేసుకుంటారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala

హిందూ సాంప్రదాయం ప్రకారం చాలామంది వివాహమైన ఆడపిల్లలు మెడలో నల్లపూసల దండ వేసుకుంటూ ఉంటారు. కానీ ఈ నల్లపూసల దండ ఎందుకు వేసుకుంటారో చాలామందికి తెలియదు.. మరి దాని గురించి వివరాలు చూద్దాం.. ఈ నల్లపూసల దండ స్త్రీ శరీరంపై ఆధ్యాత్మికంగానూ, వైజ్ఞానికంగానూ ఉత్తమ ఫలితాలు అందిస్తాయట. పూర్వకాలంలో నల్లపూసలను నల్ల మట్టితో తయారు చేసేవారు. ఈ నల్లపూసలు చాతి మీద ఉత్పన్నమయ్య ఉష్ణాన్ని పీల్చుకునేవి.

also read;ఇష్టం లేని పెళ్లి.. సరిగ్గా 4 నెలల తర్వాత ప్రియురాలితో కలిసి అలా చేసిన యువకుడు..!!

అంతేకాకుండా పిల్లలకు పాలిచ్చే తల్లుల్లో ఇవి పాలను కాపాడతాయని నమ్ముతారు. ప్రస్తుతం మోడ్రన్ ప్రపంచంలో నల్లపూసలు వేసుకోవడమే తక్కువ చేశారు. ఈ నల్లపూసల దండ వేసుకోవడం వల్ల మెడలో,గొంతు,ఛాతి భాగంలో ఉండే ఉష్ణం పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు. అంతేకాకుండా ఈ నల్లపూసలతో ఉన్నటువంటి తాళిని భర్తకి తప్ప మరొకరికి కనిపించకుండా లోపలే ఉంచుకోవాలని అంటున్నారు సాంప్రదాయా నిపుణులు.

ప్రస్తుత కాలంలో నల్లపూసల దండలు ప్రత్యేకంగా చేయించుకొని ధరిస్తున్నారు కానీ పూర్వం, తాళిబొట్టుకే ఈ నల్లపూసలను పెట్టుకునేవారు. వివాహ సమయంలో నలుపు రంగు అంటే పక్కన పెట్టేవారు.కానీ మంగళసూత్రంలో మాత్రం నల్లపూసలను అమర్చడం పట్ల కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ దీని వెనక పెద్ద చరిత్ర ఉందని శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ నల్లపూసలు ధరించడం వల్ల సౌభాగ్యవతిగా పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తారని నమ్ముతారు.

also read;సుస్మితాసేన్ కోసం గూగుల్ లో తెగ సెర్చ్ చేశారట.. ఎందుకో తెలుసా ?

Visitors Are Also Reading