Telugu News » Blog » ఆ ఒక్క కండిష‌న్ పెట్టార‌ని రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచిన క‌ల‌ర్ ఫోటో హీరో..!

ఆ ఒక్క కండిష‌న్ పెట్టార‌ని రెమ్యున‌రేష‌న్ భారీగా పెంచిన క‌ల‌ర్ ఫోటో హీరో..!

by AJAY
Ads

చాలా మంది కాల‌క్షేపం కోసం వాడుకునే సోష‌ల్ మీడియా ఎంతో మందికి లైఫ్ ఇస్తోంది. మీలో టాలెంట్ ఉండాలే గానీ సెల్ ఫోన్ స్క్రీనే మిమ్మ‌ల్ని బిగ్ స్క్రీన్ కు ప‌రిచ‌యం అయ్యేలా చేస్తుంది. ఇప్పటి వ‌ర‌కూ అలా చాలామంది టిక్ టాక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని బిగ్ స్క్రీన్ పై మెర‌స్తున్నారు. కొందు అయితే ఊహించ‌ని రేంజ్ కు వెళ్లిపోతున్నారు. అలా ఊహించని రేంజ్ కు వెళ్లిపోయిన‌వారిలో న‌టుడు సుహాస్ కూడా ఒక‌రు. మొద‌ట సుహాస్ యూట్యూబ్ లో త‌న కెరీర్ ప్రారంభించాడు. ఆ త‌ర‌వాత ఆయ‌న టాలెంట్ చూసి సినిమా అవ‌కాశాలే వెతుక్కుంటూ వ‌చ్చాయి.

Advertisement

Advertisement

suhas remunaration

suhas remunaration

కొన్ని సినిమాల‌లో క‌మెడియ‌న్ గా..హీరో ఫ్రెండ్ గా న‌టించి మెప్పించాడు. ఆ త‌ర‌వాత క‌ల‌ర్ ఫోటో సినిమాతో హీరోగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమాలో సుహాస్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. అంతే కాకుండా అత‌డి డైలాగ్ డెలివ‌రీ..కామెడీ టైమింగ్ ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఈ సినిమా ఓటీటీలో విడుద‌లైన‌ప్ప‌టికీ మంచి విజ‌యం సాధించ‌డంతో సుహాస్ కు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఇక ఈ సినిమా త‌ర‌వాత ఫ్యామిలీ డ్రామా చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. ఈ సినిమాలో సుహాస్ న‌ట‌న‌కు విమర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి.

ఇదిలా ఉండ‌గానే సుహాస్ ఇప్పుడు ఏకంగా నాలుగు చిత్రాల్లో న‌టిస్తున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాల‌కు సుహాస్ రూ,40 ల‌క్ష‌ల రెమ్యున‌రేష‌న్ ను పుచ్చుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా సుహాస్ రీసెంట్ గా మ‌రో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో మొత్తం గుండుతో క‌నిపించాల‌నే కండిష‌న్ పెట్ట‌డంతో త‌న రెమ్యున‌రేష‌న్ ను ఏకంగా రూ.45 ల‌క్ష‌ల‌కు పెంచేశాడ‌ట‌. కండిష‌న్ కార‌ణంగా రూ,5ల‌క్ష‌లు డిమాండ్ చేశాడ‌ట‌. ఇక సుహాస్ మార్కెట్ కూడా పెర‌గ‌టంతో నిర్మాత‌లు కూడా ఓకే చెప్పార‌ట‌.