Home » టోల్ ప్లాజా ట్రాఫిక్ కు చెక్.. సరికొత్త టెక్నాలజీతో టోల్ చెల్లింపు..!!

టోల్ ప్లాజా ట్రాఫిక్ కు చెక్.. సరికొత్త టెక్నాలజీతో టోల్ చెల్లింపు..!!

by Sravanthi
Ad

సాధారణంగా మనం టోల్ ప్లాజా వద్దకు వెళ్లామంటే వాహనాలతో పొడవాటి లైన్ ఉంటుంది.. ఒక వాహనం తర్వాత ఒక వాహనం టోల్గేట్ నుండి టోల్ చెల్లించి ముందుకు సాగుతాం.. ఈ సిస్టం వాహనదారులంరికీ తెలుసు.. కానీ ఓల్డ్ సిస్టంకు బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం.. సరికొత్త టెక్నాలజీ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.. ఇకనుంచి టోల్ ప్లాజా ల వద్ద ట్రాఫిక్ జామ్ ఉండదని ఈ కొత్త టెక్నాలజీ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ ఘట్కారి ఇప్పటికే తెలియజేశారు..

Advertisement

also read:కాంతార సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా ?

Advertisement

దీనికి సంబంధించి ఆల్రెడీ పనులు జరుగుతున్నాయి.. మరి ఈ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.. కేంద్ర సర్కార్ సూచించే ఒక టెక్నాలజీ గురించి చూస్తే శాటిలైట్ టోల్ సిస్టం.. ఇందులో ముఖ్యంగా కారులో జిపిఎస్ ఉంటుంది.. దీనికి సంబంధించిన టోల్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది.. మరొకటి కార్ నెంబర్ ప్లేట్ ద్వారా టోల్ చార్జి డిటెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్క వాహనానికి నెంబర్ ప్లేట్ తో జిపిఎస్ టెక్నాలజీ అమర్చబడి ఉంటుంది. శాటిలైట్ ఆధారంతో టోల్ సిస్టంలో జిపిఎస్ కారులో ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది..

 

దీని ద్వారానే టోల్ డిటెక్ట్ అవుతుంది.. దీనికోసం ఇప్పటికే కొత్త రకం నెంబర్ ప్లేట్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తుంది.. పాత నెంబర్ ప్లేట్ల స్థానంలో ఈ కొత్త నెంబర్ ప్లేట్లు బిగిస్తారు. ఇవి ఆటోమేటిక్ గా అమర్చిన జిపిఎస్ సిస్టమ్ కలిగి ఉంటాయి.. దీనికి సాఫ్ట్వేర్ జోడించబడుతుంది.. దీని ద్వారానే టోల్ డిటెక్ట్ అవుతుంది.. ఈ విధమైన టెక్నాలజీ ద్వారా సమయం ఆదా చేసుకోవచ్చు.

also read:

Visitors Are Also Reading