Home » Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఇబ్బందులు త‌ప్ప‌వు

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఇబ్బందులు త‌ప్ప‌వు

by Anji

ప్రతిరోజు ఉదయం  రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకోవ‌చ్చు. ఈరోజు  ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Today rashi phalau in telugu 04.06.2022: మేషం

 

అనుభ‌వ‌జ్ఞులు సూచించిన మార్గంలో ముందుకు సాగండి. మంచి చేకూరుతుంది. ధ‌న‌లాభం క‌లుగుతుంది. సంతోషంగా ఉంటారు.

Today rashi phalau in telugu: వృషభం 

ప్రోత్సాహ‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటుంది. మ‌నఃసౌఖ్యం క‌ల‌దు. ఓ శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువులను కొనుగోలు చేస్తారు. కీల‌క వ్య‌వ‌హారాల్లో అధికారుల నుండి ఆశీస్సులు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu: మిథునం

మీమీ రంగాల్లో మిశ్ర‌మ ఫ‌లితాలుంటాయి. కొన్ని వ్య‌వ‌హారాల్లో స‌మ‌య‌స్పూర్తితో వ్య‌వ‌హ‌రిస్తారు. చేప‌ట్టిన ప‌నుల‌ను పూర్తి చేయ‌డంలో ఇబ్బందులు ఎదురైనా పూర్తి చేసే ప్ర‌య‌త్నం చేస్తారు. ఒక‌రి ప్ర‌వ‌ర్త‌న మీకు బాధ‌క‌లిగిస్తుంది.

Today rashi phalau in telugu : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

ఓ శుభ‌వార్త వింటారు. కుటుంబ స‌భ్యుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఓ వ్య‌వ‌హారంలో ఊహించ‌ని ఫ‌లితాలు వ‌స్తాయి. మీకు సంతోషాన్ని క‌లిగిస్తాయి. అధికారుల‌కు మీ ప‌నితీరు న‌చ్చుతుంది. మీ ప్ర‌తిభ‌కు ప్ర‌సంశ‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : సింహం

చేసే ప‌నిలో మ‌నోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు పెరిగే సూచ‌న‌లున్నాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో మీరు ఆశించిన కొన్ని ఫ‌లితాల‌ను పొంద‌డానికి బాగా శ్ర‌మించాల్సి వ‌స్తుంది. శారీర‌క స‌మ‌స్య‌ల‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కండి.

Today rashi phalau in telugu : కన్య

బుద్ధిబ‌లం బాగుంటుంది. కీల‌క భ‌విష్య‌త్‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తారు. కొత్త ఆలోచ‌న‌లు చేసి వాటిని ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారు. స‌మాజంలో గౌర‌వ అభిమానాలు పెరుగుతాయి. బంధు, మిత్రుల‌ను ఆద‌రిస్తారు. పెద్ద‌ల ఆశీస్సులు, అండ‌దండ‌లు ల‌భిస్తాయి.

Today rashi phalau in telugu : తుల

అనుకూల స‌మ‌యం కాదు. మొహ‌మాటంతో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. బందు, మిత్రుల‌తో మాట ప‌ట్టింపుల‌కు పోవ‌ద్దు. చెడు సావాసాలు చేయ‌రాదు. కీల‌క విష‌యాల్లో అశ్ర‌ద్ధ‌గా వ్య‌వ‌హ‌రిస్తే ఇబ్బందులు త‌ప్ప‌వు.

Today rashi phalau in telugu : వృశ్చికం 

 

మిశ్ర‌మ కాలం. క‌ష్టాన్ని న‌మ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫ‌లితాల‌ను అందుకుంటారు. ఒక‌టి రెండు ఆటంకాలు ఎదురైనా పెద్ద‌గా ఇబ్బంది క‌లిగించ‌వు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం.

Today rashi phalau in telugu : ధనస్సు

అభివృద్ధికి సంబంధించిన శుభ‌వార్త వింటారు. నూత‌న వ‌స్తువులు కొనుగోలు చేస్తారు. అవ‌స‌రానికి త‌గిన సాయం అందుతుంది. మీ కీర్తి ప్ర‌తిష్ట‌లు పెరుగుతాయి.

Today rashi phalau in telugu : మ‌క‌రం

ప్రారంభించిన ప‌నుల్లో కొన్ని ఆటంకాలు ఎదుర‌వుతాయి. శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌వుతుంది. తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల్ల త‌రువాత ఇబ్బందులు ప‌డ‌తారు.

Today rashi phalau in telugu : కుంభం

మీమీ రంగాల‌లో విజ‌యావ‌కాశాలు మెరుగ‌వుతాయి. అభివృద్ధి కోసం చేసే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టి సత్ఫ‌లితాలు సాధిస్తారు. కుటుంబ వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉంటుంది. పెద్ద‌ల ఆశీర్వ‌చ‌నాలుంటాయి.

Today rashi phalau in telugu :  మీనం

బ‌ద్ధ‌కాన్ని ద‌రిచేర‌నీయ‌కండి. ప్రారంభించిన ప‌నుల్లో ముందుకు వెళ్తారు. ఆర్థిక విష‌యాల్లో స‌మ‌స్య‌లు తొల‌గి కుదురుకుంటారు. ఓ సంఘ‌ట‌న బాధ క‌లిగిస్తుంది. కుటుంబ స‌భ్యుల మాట‌ను గౌర‌విస్తే స‌మ‌స్య‌లు తొల‌గుతాయి.

Visitors Are Also Reading