రాశిఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Today rashi phalau in telugu : మేషం
Advertisement
ఉద్యోగంలో అనుకూలమైన కాలం నడుస్తోంది. ఆదాయానికి లోటుండదు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా బాగుంటుంది. బందుమిత్రులు సహాయమందిస్తారు. దగ్గరి బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొద్దిగా సహనం అవసరం.
Today rashi phalau in telugu : వృషభం
ఉద్యోగపరంగా కొత్త ప్రతికూలత ఉంటుంది. ఆర్థికంగా పరవాలేదు. వృత్తి వ్యాపారాల వారికి ఇది అనుకూల సమయం. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఇంటా, బయటా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం జాగ్రత్త.
Today rashi phalau in telugu : మిథునం
అదృష్టకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు పెరుగుతాయి. మీరు ఇబ్బందుల్లో ఉన్నా ఇతరులకు సహాయం చేస్తారు. వ్యాపారంగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం సానుకూలపడుతుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఉద్యోగంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్థికంగా చాలావరకు పరవాలేదు. ఆస్తి విలువ పెరుగుతుంది. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబపరంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మిత్రుల సలహాలతో ప్రయోజనం పొందుతారు. కుటుంబంలో ఒకరి అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు.
Today rashi phalau in telugu : సింహం
ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గించుకోవాలి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఇల్లు మారడానికి అవకాశం ఉంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. సంతానం పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు వారిపరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
Today rashi phalau in telugu : కన్య
ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఇంటా బయటా శ్రమ ఉంటుంది. పెళ్లి సంబంధం కుదరకపోవచ్చు. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్న పిల్లల పరిస్థితి బాగుంటుంది. వ్యాపారులు లబ్దిపొందుతారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడుతాయి.
Advertisement
Today rashi phalau in telugu : తుల
ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త పనులు చేపట్టడంలో ఆచితూచి అడుగేయాలి. కుటుంబంలోని సమస్యలు తలెత్తుతాయి. వైద్యం మీద ఖర్చు చేయాల్సి వస్తుంది. స్నేహితుల సహాయంతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభం కనిపిస్తోంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఉద్యోగంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం కనిపిస్తుంది. ధనలాభం ఉంటుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. కుటుంబ పరంగా మంచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదు.
Today rashi phalau in telugu : ధనస్సు
ఉద్యోగంలో అనుకోకుండా సంపాదన పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశముంది. కొత్త పనులు చేపడుతారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వ్యాపారులకు అన్ని విధాలుగా బాగుంటుంది. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు వస్తాయి.
Today rashi phalau in telugu మకరం
ఉద్యోగం అనుకూలంగా ఉంది. వ్యాపారులు లాభాల బాట పడతారు. వ్యక్తిగత సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఆదాయం పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. అనవసర ఖర్చులతో అవస్థలు పడతారు. ఆరోగ్యం జాగ్రత్త ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.
Today rashi phalau in telugu : కుంభం
ఉద్యోగరిత్యా శుభం జరుగుతుంది. వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి. మిత్రుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సమస్య చికాకు కలిగిస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడుతాయి. ఆరోగ్యం జాగ్రత్త. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు.
Today rashi phalau in telugu : మీనం
ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు అర్జిస్తారు. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బంధువులు ఇబ్బంది పెడతారు. కలిసి వస్తున్న కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సంతానం పురోగతి సాధిస్తారు.