Home » Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు..ఆ రాశి వారికి ఆర్థికంగా కలిసొస్తుంది

by Anji
Ad

Today Rasi phalau in telugu :  ప్రతిరోజు రాశి ఫలాలను చదవడం ద్వారా  ఆయా రాశుల వారికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.  ఇక ఇవాళ ఎవరెవరి రాశి  ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం. 

Today rasi phalau in telugu 2022

Today rasi phalau in telugu 2023

Today rashi phalau in telugu 04.08.2023: మేషం

Advertisement

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు జరిగి రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. కుటుంబంలో మీ ఆలోచనలకు, నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. 

Today rashi phalau in telugu :  వృషభం 

 మీ వృత్తికి డిమాండ్ బాగా పెరుగుతుంది. సంపాదన కూడా పెరుగుతుంది. ఉద్యోగ రిత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార రంగంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. 

Today rashi phalau in telugu : మిథునం

ఆర్థిక వ్యవహారాలు ఆశించిన స్థాయిలో పూర్తి అవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం ఉత్తమం. 

Today rashi phalau in telugu : కర్కాటకం 

ఆర్థిక ప్రయత్నాలతో ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు. ఉద్యోగంలో గౌరవ అభిమానాలు పెరుగుతాయి. మీ పని తీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. పిల్లల చదువుల మీద మీరు శ్రద్ధ పెట్టాల్సిన అవసరముంటుంది. 

Today rashi phalau in telugu :  సింహం

ఆస్తి వివాదాలలో సోదర వర్గంతో రాజీమార్గాన్ని అనుసరించాల్సి వస్తుంది. రాదు అనుకున్న డబ్బు చేతికి అందుతుంది. దైవ కార్యంలో కుటుంబ సమెతంగా పాల్గొంటారు.  

Today rashi phalau in telugu : కన్య

ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. ఖర్చులు పెరిగే అవకాశముంది. వ్యయ, ప్రయాసలతో కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ పెద్దలతో స్వల్ప అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. 

Advertisement

Today rashi phalau in telugu : తుల

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అలవికాని లక్ష్యాలు మీ మీద పడే అవకాశముంది. జీవితంలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది.  వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. 

Today rashi phalau in telugu : వృశ్చికం

వృత్తి, వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నూతన ప్రయత్నాలు, కొత్త ఆలోచనల వల్ల ఆశించిన ఫలితాలుంటాయి. ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 

Today rashi phalau in telugu : ధనుస్సు

ఆర్థిక ప్రయత్నం ఎటువంటిది అయినప్పటికీ కలిసి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగాలతో పాటు ఉద్యోగ మారే ప్రయత్నాలు కలిసి వస్తాయి. 

Today Horoscope in telugu : మకరం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

ఆర్థిక విషయాల్లో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి.అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితంలో మార్పులు చేస్తారు. ఉద్యోగంలో బరువు, బాధ్యతల పెరిగే అవకాశముంటుంది. వ్యాపారంలో కొత్త వ్యూహాలను అమలు చేసి లబ్ది పొందుతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.  

Today Horoscope in telugu : కుంభం

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం కాస్త పెరుగుతుంది. కొన్ని ప్రతిఫలం లేని పనులను నెత్తిన వేసుకునే అవకాశముంది. స్నేహితుల సహకారంతో వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో పోటీ పెరిగి ఇబ్బంది పడుతారు.

Today rasi phalau in Telugu 2023 : మీనం

Today Rasi Phalalu in Telugu 2022

Today Rasi Phalalu in Telugu 2023

వృత్తి,ఉద్యోగాల వాతావరణం చాలా వరకు ప్రోత్సాహకరంగానే ఉంటుంది. వ్యాపారాల్లో అంచనాలకు తగినట్టు రాబడి ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ఉత్తమం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారికి ఈ వారంలో అదృష్టం కలిసొస్తుంది

Visitors Are Also Reading