రాశి ఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today Rashi phalau in Telugu 12.04.2022: మేషం
అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి జరుగుతుంది. సొంత నిర్ణయాలతో ముందుకు వెళతారు. ఖర్చులు పెరిగినా ఆర్థిక పరిస్థస్థితి బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగాప్రయాణాలు లాభిస్తాయి.
Today rashi phalau in telugu : వృషభం
ఉద్యోగంలో అధికార లాభం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉన్నా కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. పిల్లలు పురోగతి చెందుతారు. మంచి కుటుబంలో వివాహ సంబంధం కుదురుతుంది.
Today rashi phalau in telugu : మిథునం
వృత్తి నిపుణులకు మంచి అభివృద్ధి కనిపిస్తోంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అనుభవానికి వస్తాయి. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. ఎందులోనూ పెట్టుబడులు పెట్టవద్దు. స్నేహితులతో అపార్థాలకు అవకాశం ఉంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. ఆరోగ్యం పరవాలేదు. రాదనుకున్న డబ్బు చేతిక అందుతుంది.
Today rashi phalau in telugu : సింహం
ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపార పరంగా లాభాలున్నాయి. గట్టిగా ప్రయత్నిస్తే ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. వ్యాపారంలో బాగా శ్రమ పడాల్సి ఉంటుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
ఆదాయ వృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు కలిసి వస్ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగం విషయంలో సమయం అనుకూలంగా ఉంది. అధికారులతో సామరస్యంగా వ్యవహరించండి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : తుల
ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది.
Today rashi phalau in telugu : వృశ్చికం
ఆర్థికంగా బాగానే ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల అండదండలు లభిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. శుభవార్త వింటారు. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు కొద్దిగా లాభాల ఆర్జిస్తారు.
Today rashi phalau in telugu : ధనస్సు
ఉద్యోగంలో అధికారులు బాధ్యతలను పెంచుతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.వ్యక్తి గత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ పొందిన వారు ముఖం చాటేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది.
Today rashi phalau in telugu మకరం
ఆర్థిక స్తోమత కాస్తంత పెరుగుతుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఇంటి సమస్య కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఎదురవుతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
Today rashi phalau in telugu : కుంభం
ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశముంది. ఆదాయం పెరుగుతుంది. బంధువుల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు రాకుండా జాగ్రత్తపడాలి. మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం పరవాలేదు.
Today rashi phalau in telugu : మీనం
వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. ఉద్యోగంలో గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి సంబంధించి శుభవార్త వింటారు.