రాశి ఫలాలు చదవడం మీ భవిష్యత్‌ను అంచనా వేయాడానికి సులభమమైన మార్గాలలో ఒకటి. మీ భవిష్యత్‌ను ముందే చెప్పడం నుండి చివరకు మీ రోజును ఉహించడం వరకు అన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఇవాళ ఎవరెవరి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Today Rashi phalau in Telugu 05.04.2022: మేషం
వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమతో కూడిన విజయాలున్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. బుద్దిబలంతో ఆపదలు దూరమవుతాయి.
Today rashi phalau in telugu : వృషభం
ముఖ్యమైన పనులను ప్రారంభించే ముందు బాగా ఆలోచించి మొదలు పెట్టండి. తోటివారి సహకారం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో దైవబలం రక్షిస్తోంది.
Today rashi phalau in telugu : మిథునం
ప్రారంభించిన పనుల్లో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యవిషయాల్లో బంధు మిత్రులను కలుపుకొని పోవడం మంచినిస్తుంది.
Today rashi phalau in telugu : కర్కాటకం
ఆయా రంగాల్లో శ్రమ పెరుగుతుంది. మంచి మనస్సుతో ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
Today rashi phalau in telugu : సింహం
మీమీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
Today rashi phalau in telugu : కన్య
Advertisement
మనోధైర్యం ముందుకు నడిపిస్తుంది. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తి చేయగలుగుతారు. శరీర సౌఖ్యం ఉంది.
Today rashi phalau in telugu : తుల
ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. అవసరానికి తగిన సాయం చేసే వారున్నారు. తోటివారి సహకారంతో ఆపదలు తొలుగుతాయి. మనోవిచారాన్ని కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
Today rashi phalau in telugu : వృశ్చికం
మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండడం మేలు.
Today rashi phalau in telugu : ధనస్సు
ఒక ముఖ్య వ్యవహారంలో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం ఉంటుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది.
Today rashi phalau in telugu మకరం
ఓ శుభవార్త ఇంట్లో సంతోషాన్నిస్తుంది. ఓ ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు.
Today rashi phalau in telugu : కుంభం
మధ్యమ ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శరీర సౌఖ్యం ఉంది.
Today rashi phalau in telugu : మీనం
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో తగిన సాయం అందుతుంది. చంచల స్వభావాన్ని రానీయకండి.