ఇండియాలో పదుల సంఖ్యలోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యంగా యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రమాదవశాత్తు జరిగితే… మరికొన్ని ఆక్సిడెంట్లు మాత్రం మద్యం సేవించి.. నడపడం వల్ల కారు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా చాలామంది మరణిస్తున్నారు. కొంతమంది క్షతగాత్రులు అవుతున్నారు.
READ ALSO : భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!
Advertisement
అయితే తాజాగా ఏపీలో ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఏపీలోని తిరుపతిలో షోరూం నుంచి అప్పుడే కొనుగోలు చేసిన కారు బీభత్సం సృష్టించింది. కారును కొన్న వ్యక్తి డ్రైవ్ చేశాడు. అయితే బ్రేక్ వేయబోయే సమయంలో అతను ఎక్సలేటర్ తొక్కాడు. దీంతో కారు రయ్యిమంటూ రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి దుకాణంలోకి దూసుకుపోయింది. రోడ్డు పక్కనే ఉన్న మరో నాలుగు బైకులను ఢీ కొట్టింది కారు. దీంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.
Advertisement
read also : కృష్ణ చేయాల్సిన మూవీ..కానీ వెంకటేష్ ఎందుకు చేశాడు !
షోరూం నుంచి కొత్త కారు తీసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కారు కొనుగోలు చేసిన వ్యక్తికి డ్రైవింగ్ రాకపోవడం ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.