Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళి తదితరులు ‘టిల్లు స్క్వేర్‘ సినిమాలో నటించారు. 2022 లో వచ్చిన ‘డిజె టిల్లు’ కి ఈ సినిమా సీక్వెల్. ‘డిజె టిల్లు’ కి విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ సీక్వెల్ కి మాత్రం మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సిద్దు జొన్నలగడ్డ కథతోనే ఈ సినిమా కూడా రూపొందింది.
సినిమా: టిల్లు స్క్వేర్
నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళి తదితరులు.
దర్శకత్వం: మల్లిక్ రామ్
నిర్మాత: నాగవంశీ
రిలీజ్ డేట్: 29-03-2024
Advertisement
కథ మరియు వివరణ:
టిల్లు కి పెళ్లి చేయాలని ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ టిల్లు మాత్రం నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంటదు. సోలోగా నా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్తాడు. ఆ క్రమంలోనే ఒకరోజు పబ్ లో లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) మీట్ అవుతుంది. లిల్లీ తో ప్రేమలో సిద్దు పడతాడు. ఆమె కోసం మాఫియాతో పోరాడాల్సి ఉంటుంది. టిల్లు మొదటి పార్ట్ లో రాధిక తనని మోసం చేసి వెళ్ళిపోయిందో లిల్లీ కూడా అలానే టిల్లుని మోసం చేసి వెళ్ళిపోతుందా..? లేదంటే ఆమె అతన్ని పెళ్లి చేసుకుంటుందా..? తెలియాలంటే టిల్లు స్క్వేర్ చూడాలి. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాని అద్భుతం తెర మీదకి తీసుకు వచ్చాడు. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నప్పటికీ అవి మరి పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. మూవీ లో అడల్ట్ సీన్స్ వున్నా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. మూవీ మళ్ళీ మ్యాజిక్ చేసింది.
Advertisement
Also read:
- Jagan: సీఎం ys జగన్ డిగ్రీ మార్క్స్ లిస్ట్ చూసారా ? ఇందులో ఉన్న పేర్లు చూసారా
- Pushpa: పుష్ప మేనరిజం ని.. శ్రీహరి 20 ఏళ్ల క్రితమే చేసారు తెలుసా..?
- Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది..!
ఇక ఈ సినిమా ఫస్ట్ అఫ్ ఎంటర్టైన్ చేసింది. సెకండ్ హాఫ్ లో కూడా అదే ఎంటర్ టైన్ మెంట్ కంటిన్యూ చేసినా ఎమోషనల్ సీన్స్ యాడ్ చేయడం ప్లస్ అయ్యాయి. సిద్దు జొన్నలుగడ్డ చెప్పే డైలాగులకి ప్రేక్షకులు ఎంజాయ్ చేసారు. కొన్ని సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. వాటిని కూడా క్లారిటీ గా చూసుకొని ఉంటే బాగుండేది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్స్ అలానే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ అదిరిపోయాయి. మూవీ లో అనుపమ పరమేశ్వరన్ మరో అట్రాక్షన్ అనే చెప్పచ్చు. సిద్దు అనుపమ మధ్య వచ్చే కొన్ని సీన్లు కూడా బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఒకే అనిపించింది. రామ్ మిరియాల అందించిన మ్యూజిక్ కూడా సూపర్బ్.
ప్లస్ పాయింట్స్:
సిద్దు జొన్నలగడ్డ నటన
కామెడీ సీన్లు
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
లాజిక్ లేని సీన్స్
మ్యూజిక్
రేటింగ్ 2.75/5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!