Tillu Square 2 : డీజే టిల్లు కి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ ని తీసుకువచ్చారు. డీజే టిల్లు సినిమా ఓ రేంజ్ లో ప్రేక్షకుల్ని మెప్పించింది అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావడం జరిగింది. సిద్దు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్స్ గా నటించారు. మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి రిలీజ్ అయింది. ప్రేక్షకుల్ని కొంతవరకు బానే ఆకట్టుకుందని చెప్పొచ్చు. అయితే ఇందులో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి అనే విషయానికి వచ్చేద్దాం.
Advertisement
సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రెండు విషయాలు మీదే కాస్త నెగటివ్ టాక్ అయితే వస్తోంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయని మూవీ చూడకుండా ట్రైలర్ ని చూస్తే క్లియర్ గా తెలిసింది ఈ సీన్లు లిమిట్ కి మించి ఉండడం మైనస్ అని అందరూ అంటున్నారు. కొన్ని చోట్ల సీన్లు అవసరం లేకపోయినా పెట్టారని టాక్ అయితే వచ్చింది.
Advertisement
Also read:
- సిద్ధార్థ్ – అదితి రావు హైదరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..?
- భార్యా లేదా భర్తలో ఈ విషయాలను గమనిస్తే.. వాళ్ళని విడిపెట్టేయడమే మంచిది..!
- Tirupati Railway Station: తిరుపతి వెళ్తున్నారా..? ఈ సర్వీస్ ని మిస్ అవ్వద్దు.. రూ.50 మాత్రమే..!
ఇలా ఈ విషయం మీద నెగిటివిటీ బాగా ఎక్కువైంది. అలానే మొదటి మూవీకి సంబంధించి చాలా రిఫరెన్స్ లని సెకండ్ పార్ట్ లో వాడారు. సేమ్ టెంప్లేట్ మీద వచ్చింది మూవీ కొన్నిసార్లు నవ్వొచ్చినా కూడా ఎక్కువసార్లు ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. ఈ రెండు విషయాలు మీద చిత్ర యూనిట్ కొంచెం జాగ్రత్త పడి ఉంటే బాగుండేది ఈ రెండు కూడా మూవీకి పెద్ద మైనస్లు అయ్యాయని చెప్పొచ్చు. ఏదేమైనా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో మూవీ దూసుకు వెళ్ళిపోతోంది. హిట్ టాక్ తో పార్ట్ వన్ దాటేస్తుందో లేదో అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!