Home » Tiger Nageswara Rao review : “టైగర్ నాగేశ్వరరావు” రివ్యూ..మాస్ ఫ్యాన్స్ కు జాతరే

Tiger Nageswara Rao review : “టైగర్ నాగేశ్వరరావు” రివ్యూ..మాస్ ఫ్యాన్స్ కు జాతరే

by Bunty
Ad

Tiger Nageswara Rao review : మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఆంధ్ర రాబిన్ హుడ్ గా పేరొందిన స్టువర్టుపురం నాగేశ్వరరావు బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ గజదొంగగా అలరించనున్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.

Tiger Nageswara Rao movie review

Tiger Nageswara Rao movie review

కథ మరియు వివరణ :

Advertisement

మాస్ మహారాజా రవితేజ హీరోగా చేసిన టైగన్‌ నాగేశ్వరరావు సినిమా కథ విషయానికి వస్తే…ప్రైమ్ మినిస్టర్ (అనుపమ్ కేర్) కి, గుంటూరు ఎస్పీ (మురళీ శర్మ) మాట్లాడుతూ ఉంటారు. టైగర్ నాగేశ్వరరావు (రవితేజ) కథని ఆయన చెప్పడం జరుగుతుంది. ఇలా మూవీ స్టార్ట్ అవుతుంది. స్టువర్టుపురంలో ఉండే స్టువర్టుపురం నాగేశ్వరరావు యుక్త వయసులో సారా (నుపుర్ సనన్) అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. అక్కడ జరుగుతున్న కొన్ని సంఘటనల కారణంగా స్టువర్టుపురం నాగేశ్వరరావు మారుతాడు. అయితే మరి స్టువర్టుపురం నాగేశ్వరరావుకు ఎదురైన సంఘటనలు ఏవి? స్టువర్టుపురం నాగేశ్వర రావు టైగర్ నాగేశ్వరరావు గజదొంగగా ఎందుకు మారాడు? కారణం ఏమిటి? ఒక వివిఐపి ఉన్నచోట చోరీ ఎందుకు చేస్తాడు? ఊరిలో ఎలాంటి మార్పుని అతను తీసుకువస్తాడు? స్టువర్టుపురం దొంగని పట్టుకోవాలని ప్రైమ్ మినిస్టర్ ఎందుకు ఆర్డర్ వేశారు? టైగర్ నాగేశ్వరరావుని పోలీసులు ఆఖరికి పట్టుకున్నారా? ఇవన్నీ సినిమా చూసి తెలుసుకోవాలి.

Advertisement

నిజజీవిత సంఘటన ఆధారంగా ఈ మూవీని తీసుకువచ్చారు. ఇక టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉందని ప్రీమియర్ టాక్. టైగర్ నాగేశ్వరరావు పాత్రను పరిచయం చేసిన తీరు, క్యారెక్టరైజేషన్ బాగా కుదిరాయి. రోబరి సన్నివేశాలు, యాక్షన్ సీక్వెన్లు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ లో రెండు దోపిడీ సన్నివేశాలు ఉన్నాయి. వాటిలో ట్రైన్ రాబరీ సన్నివేశం హైలైట్ అంటున్నారు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుందని ప్రేక్షకుల అభిప్రాయం. మొదటి సగం దర్శకుడు గొప్పగా నడిపించాడు. సెకండ్ హాఫ్ మాత్రం డ్రాగ్ అయిందంటున్నారు. టైగర్ నాగేశ్వరరావు మూవీ నిడివి దాదాపు మూడు గంటలు. ఈ క్రమంలో సెకండ్ హాఫ్ లెంగ్తి అయింది అన్నమాట వినిపిస్తోంది.

ప్లస్ పాయింట్స్ :

రవితేజ

స్టోరీ

యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

లవ్ ట్రాక్

రెండవ పార్ట్

రేటింగ్ : 2.5/5

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading