Home » శీతాకాలంలో ఇమ్యూనిటీని పెంచే మూడు పండ్లు.. ఏంటంటే..?

శీతాకాలంలో ఇమ్యూనిటీని పెంచే మూడు పండ్లు.. ఏంటంటే..?

by Sravanthi
Ad

శీతాకాలం రాగానే చాలామందికిఅనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.జలుబు, జ్వరం, ఇతర సీజనల్ వ్యాధులన్నీ చుట్టుముడతాయి.. ముఖ్యంగా ఈ వ్యాధుల బారి నుండి మన శరీరాన్ని కాపాడుకోవాలి అంటే ఈ 5 రకాల ఆహార పదార్థాలు తప్పనిసరిగా తినాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ పదార్థాలు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఎలాంటి వ్యాధులు దరిచేరయని తెలియజేస్తున్నారు. మరి ఆ పదార్థాలు ఏంటో చూద్దాం..
జామ:

Advertisement

ALSO READ;పుష్ప2 లో రామ్ చరణ్.. బయటకు వచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్..!!

ఈ సీజన్లో ఎక్కువగా దొరికే పండు జామ. దీనిలో ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామ పండులో ఉండే ఫైబర్ వల్ల వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. జామ లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు ప్రమాదకరమైన బ్యాక్టీరియాల నుండి మనల్ని రక్షిస్తాయి.
కివి :

Advertisement


మనం అనారోగ్యం బారిన పడ్డాము అంటే ముందుగా తినాల్సింది కివి పండు.. ఇందులో విటమిన్ సి ఉండి ఈ చల్లని వాతావరణంలో మనకు ఎంతో మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్లేట్లెట్స్ వేగంగా వృద్ధి చెందుతాయి. కాబట్టి శీతాకాలంలో కివి పండు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
దానిమ్మ:


శీతాకాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆర్థసైటిస్ వ్యాధిగ్రస్తులకు ఈ సీజన్ చాలా ఇబ్బంది పెడుతుంది. చలికాలంలో దానిమ్మ పండు తింటే కీళ్లనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. దానిమ్మలో ఉండే ఫైబర్, ఒమేగా, ఐరన్ తినడం వల్ల రక్త పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా తయారవుతారు.

ALSO READ;hansika marriage: హన్సిక పెళ్లి ఖర్చుతో ఒక ఊరిని బాగు చేయొచ్చు.. ఎన్ని కోట్లంటే..?

Visitors Are Also Reading