Telugu News » Blog » పుష్ప2 లో రామ్ చరణ్.. బయటకు వచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్..!!

పుష్ప2 లో రామ్ చరణ్.. బయటకు వచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్..!!

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది.. ఆయన నటనలో కూడా సరికొత్త స్టైల్ ఉంటుంది.. అందుకే అల్లు అర్జున్ కు విపరీతమైన యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటి అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలుసు.. ఇప్పటికీ ఈ సినిమా డైలాగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. చిన్నపిల్లడి మంచి ముసలావిడ వరకు సందర్భం వస్తే మాత్రం తగ్గేదేలే అనే డైలాగును వాడతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Advertisement

ALSO READ;అవతార్ 2 సెన్సార్ పూర్తి.. నిడివి గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

అలాంటి అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనతో అందరినీ మెస్మరైజ్ చేయడమే కాకుండా ఒక ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నారు.. అందుకే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రికార్డుల మోత మోగించింది.. అయితే దీనికి సీక్వెల్ గా దర్శకుడు సుకుమార్ పుష్ప-2 ని కూడా తెరకెక్కిస్తున్నారు.. ఈ తరుణంలో పుష్ప-2 గురించి ఒక అప్డేట్ బయటకు లీక్ అయింది. ఇప్పటికే షూటింగ్ మొదలై కొన్ని వారాలు గడుస్తోంది. మళ్లీ రెండో షెడ్యూల్ షూటింగ్ వచ్చేవారం స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది.

అయితే పుష్ప -2 లో అల్లు అర్జున్ తో పాటుగా స్టార్ నటులను తీసుకుంటున్నారట. మరీ ముఖ్యంగా ఇందులో మెగా హీరో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది.. రామ్ చరణ్ క్లైమాక్స్ లో అదరగొడతారని తెలుస్తోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వైరల్ గా మారాయి.ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మూవీ యూనిట్ కచ్చితంగా స్పందించాల్సిందే.

ALSO READ;కాంతార, సాయి ధరమ్‌ తేజ్ విరూపాక్ష సినిమాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

Advertisement

You may also like