సీనియర్ ఎన్టీఆర్ గారు ఏ పాత్ర చేసినా అదొక అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎన్టీఆర్ జాతకాన్ని ఆ రెండు చిత్రాలు మార్చాయి.
Advertisement
సత్య చిత్ర బ్యానర్ మీద శోభన్ బాబుతో తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రాన్ని కె. ఎస్. ప్రకాశ్ రావు దర్శకత్వంలో నిర్మాతలు సత్యనారాయణ, సూర్యనారాయణలు నిర్మించారు. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నిర్మాతలే శోభన్ బాబు, వాణి శ్రీలతో ఓ చిత్రాన్ని నిర్మించారు కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ప్రేమబంధం.
మరో చిత్రంలో శోభన్ బాబు హీరోగా కన్నడలో సూపర్ హిట్ సాధించిన గంధదగుడి చిత్రం యొక్క కథను మార్పులు చేసి రాసుకున్నారు. కానీ చివరలో శోభన్ బాబు తప్పుకున్నాడు. ఎన్టీఆర్ కి కథ చెప్పగానే ఒప్పుకున్నాడు. ఆ చిత్రమే అడవి రాముడు. దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నాలుగు కేంద్రాల్లో ఏడాదికి పైగా ఆడింది. అప్పటికే ఒక హిట్ నాలుగు ప్లాఫ్ లతో ఉన్నటువంటి ఎన్టీఆర్ కి ఇది మంచి విజయం సాధించింది.
Advertisement
Also Read : 12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్
మరోవైపు ఎన్టీఆర్ నటించిన యమగోల చిత్రం కథ తొలుత శోభన్ బాబుకే చెప్పారట. కానీ ఆయన ఒప్పుకోకపోవడంతో.. మళ్లీ ఎన్టీఆర్ కి కథ చెప్పారట. ఎన్టీఆర్ యాక్సెప్ట్ చేశారు. యముడిగా ఎన్టీఆర్ ని, యువ హీరోగా బాలకృష్ణని నటింపచేద్దామని కోరాడు. ఎన్టీఆర్ మాత్రం హీరోగా తానే నటిస్తానని.. యముడిగా సత్యనారాయణను తీసుకోమని చెప్పాడట. అలా వచ్చిన యమగోల చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ గెటప్పు, సెటప్పు మొత్తం మారిపోయి మళ్లీ పదేళ్ల వరకు తిరుగులేని ఇమేజ్ తో రాజకీయాలకు వెళ్లే వరకు కూడా టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగారు.
Also Read : “వీర సింహారెడ్డి” ఎవరో నాకు తెలీదు.. విలన్ డైలాగ్ పై ట్రోలింగ్