Home » ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా..? ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

by Anji
Ad

సాధారణంగా చాలా మంది చిన్నప్పటి ఫొటోలు చూడటానికి చాలా బాగుంటాయి. అందరూ చూసి ఆశ్చర్యపోతుంటారు. ఓ.. చిన్నప్పుడు ఈమె ఇలా ఉండేవారా..? ఆయన అలా ఉన్నారా అని చర్చించుకుంటారు. ఇక సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఫొటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ హీరోయిన్ కి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.

Advertisement

అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుని.. అంతలోనే ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది కథానాయకలు అందం, అభినయంతో మెప్పించి ఆడియన్స్ హృదయాలను దోచేసుకున్నారు. మొదటి చిత్రానికే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకొని.. అగ్ర హీరోల సరసన నటించి స్టార్ డమ్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడిపేస్తున్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి టాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సరసన నటించి మెప్పించింది .ఎవరో గుర్తుపట్టారా..? ఇటీవలే తల్లిగా ప్రమోషన్ పొందింది. తనే హీరోయిన్ ఇలియానా.

Advertisement

2006లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన దేవదాసు సినిమాతో తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుని స్టార్ట్ డమ్ సంపాదించుకుంది. తొలి చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు జోడిగా పోకిరి సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఈ బ్యూటీకి అటు తమిళంలోనూ వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించిన ఇలియానా.. 2012లో బర్ఫీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా సక్సెస్ తో బాలీవుడ్ లోనూ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఇలియానా. ఆ తర్వాత షాహిద్ కపూర్ తో కలిసి ఫాటా పోస్టర్ నిక్లా హీరోలో కనిపించింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చంద్రబాబు అరెస్ట్ తరువాత ఎన్టీఆర్ దుబాయ్ కి ఎందుకు వెళ్లాడో తెలుసా ?

 పెళ్లి గురించి శృతిహాసన్ ఏమందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading