టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి రాజమౌళి గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇటీవలే ఈయన టాప్ 100 వరల్డ్ ఇన్ ఫ్లూయెన్షియల్ పీపుల్స్ జాబితాలో చోటు దక్కించుకుని ట్రెండింగ్ లోకి వచ్చారు. ప్రస్తుతం రాజమౌళి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రాజమౌళి, భార్య రమా రాజమౌళి లవ్ స్టోరీ గురించి చాలా మందికి తెలియదు. రమా రాజమౌళి ప్రస్తుతం రాజమౌళి సినిమాల్లోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తుంటారు.
Advertisement
రాజమౌళి సినీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలకు ఆమెనే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తుండటం గమనార్హం. వాస్తవానికి వీరిద్దరినీ ఇండస్ట్రీలో ఆదర్శ దంపతులుగా భావిస్తుంటారు. వీరి ప్రేమ ఎలా ప్రారంభమైంది ? ఆ ప్రేమ పెళ్లి వరకు ఎలా వెళ్లింది అనే విషయాలు చాలా మందికి తెలియదు. సినీ రంగంలో ఉన్న అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజమౌళిని పెళ్లి చేసుకోవడం కంటే ముందే రమకు వేరే వ్యక్తితో పెళ్లి జరిగింది. వారి దాంపత్యానికి గుర్తుగా కార్తికేయ జన్మించాడు. ఆ తరువాత అభిప్రాయ భేదాలు రావడంతో రమ తన కుమారుడితో వేరుగా జీవించడం ప్రారంభించింది.కీరవాణి, రాజమౌళి ఇద్దరూ అన్నదమ్ముల కుమారులు. ముఖ్యంగా రాజమౌళి సినిమాలో ఇప్పటివరకు కీరవాణి తప్ప మిగతా వారు మ్యూజిక్ అందించలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు. రమ కీరవాణి భార్య వల్లి సోదరి. దగ్గరి బంధుత్వం ఉండటంతో రాజమౌళి, రమా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే రాజమౌళి శాంతినివాసం సీరియల్ కి దర్శకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు.
Advertisement
Also Read : మిర్చి విలన్ సంపత్ రాజ్ ఆ తమిళ నటిని పెళ్లిచేసుకున్నాడా..? బయటపడిన అసలు నిజం ఇదే.!
ఇక ఆ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రానికి దర్శకత్వం వహించే సమయానికి ప్రేమ చిగురించింది. అప్పటికీ పెళ్లి అయి ఓ కుమారుడున్నాడనే విషయం తెలిసిన రాజమౌళి రమను పెళ్లి చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాడు. పెద్దలను కూడా ఒప్పించాడు. సినీ కుటుంబం కావడంతో హడావిడి పెళ్లి చేసుకోకుండా సాదాసీదాగానే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా కార్తికేయను సొంత కుమారుడి కంటే ఎక్కువగా రాజమౌళి చూసుకుంటూ వచ్చారు. ఒకవేళ తమకు సంతానం కలిగితే కార్తికేయను సరిగ్గా చూసుకోమేమో అనే ఉద్దేశంతో రాజమౌళి రమతో సంతాన్ని కూడా కోరుకోలేదని చెబుతుంటారు. రాజమౌళి ఓ ఆడపిల్లను దత్తత తీసుకొని పెంచుతూ వస్తున్నారు. రాజమౌళి సినిమాకి దాదాపు ఫ్యామిలీ మొత్తం కష్టపడుతుంది. కుమారుడు కార్తికేయ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఖర్చు ఎక్కువ కాకుండా తక్కువ ఖర్చులోనే క్వాలిటీ సినిమా ఎలా ఇవ్వాలనే బాధ్యతలను తీసుకుంటుంటాడు.
Also Read : మెస్ నుండి ప్రింటింగ్ ప్రెస్ వరకూ….సినిమాల్లోకి రాకముందు ఎన్టీఆర్ చేసిన వ్యాపారాలు ఇవే..!