Home » ప్రభాస్‌ సలార్‌ను డిసెంబర్‌ 22నే రిలీజ్‌ చేయడానికి కారణమిదే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

ప్రభాస్‌ సలార్‌ను డిసెంబర్‌ 22నే రిలీజ్‌ చేయడానికి కారణమిదే.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత..!

by Anji
Ad

పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌  టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం సలార్‌. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సలార్ రెండు పార్టులుగా వస్తోందని తెలిసిందే. కాగా Salaar Part-1 Ceasefire డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూ్స్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Advertisement

బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ మాట్లాడుతూ.. సలార్‌ పార్ట్‌ 1ను జ్యోతిష్య కారణాల రీత్యా డిసెంబర్ 22నే విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. అదే టైంలో డంకీ, ఆక్వామాన్‌ విడుదలవుతున్నప్పటికీ జ్యోతిష్య కారణాల వల్లే సినిమాను ముందుకు జరుపడం చేయలేదని చెప్పాడు. చాలా పెండింగ్ పనులుండటం వల్ల ముందుగా అనుకున్న ప్రకారం.. సెప్టెంబర్ 28న విడుదల చేయలేదని, ఆ తర్వాత తాము మే 2024 లో పలు తేదీలను పరిశీలించిన అనంతరం డిసెంబర్ 22 2023ను ఫైనల్‌ చేశామని చెప్పుకొచ్చారు. ఈ నెలలో క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సీజన్లు వస్తుండటంతో.. ప్రేక్షకుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని వెల్లడించాడు.

Advertisement

సలార్‌లో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన వరదరాజ మన్నార్ ది కింగ్ లుక్‌ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. సలార్‌ను కేరళలో పృథ్విరాజ్‌ సుకుమారన్ హోం బ్యానర్ పృథ్విరాజ్ ప్రొడక్షన్స్‌ హౌజ్‌ విడుదల చేస్తోంది. నైజాంలో టాలీవుడ్‌ పాపులర్ ప్రొడక్షన్‌ బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్ సలార్‌ను రిలీజ్ చేస్తుండగా.. నార్తిండియాలో అనిల్‌ తడని AA Films ఈ సినిమాను విడుదల చేస్తోంది. ఇక ఓవర్సీస్‌లో సలార్‌ను Phars Film Co LLC విడుదల చేస్తోంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading